NTV Telugu Site icon

Telangana: వానకాలంలో కంకులకు డిమాండ్‌.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతి..

Telangana

Telangana

Telangana: నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది. చల్లటి వాతావరణంలో, వేడివేడి నిప్పులపై కాల్చిన మొక్కజొన్నను ఆరగించడానికి నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు నగరవాసులు. దీంతో కంకులకు మంచి డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ నగరానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కంకులు దిగుమతి అవుతుంది. ప్రతి సంవత్సరం జూన్‌లో కంకులు దిగుమతి అయ్యేవి. ఈసారి పంట ఆలస్యంగా రావడంతో జులై నుంచి కంకులతో కళకళలాడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా పాతబస్తీలోని దారుస్సలాం రోడ్డులో కుప్పలు తెప్పలుగా కన్నుల పండువగా సాగుతున్నాయి. చిరు వ్యాపారులు హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక్కో కంకి ధర రూ.5గా ఉంది.

Read also: CM Revanth Reddy: పరీక్షలు పెట్టకుండా… వాయిదా వేస్తూపోతే వయసైపోతుంది..

ఇదిలా ఉండగా మార్కెట్‌లో ఈ కంకులు ఒక్కోటి రూ.20. దూర ప్రాంతాల నుంచి నగరానికి తీసుకురావాలంటే రవాణా ఛార్జీల భారం ఎక్కువగా ఉండడంతో ధరలు పెంచాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 20 శాతం మాత్రమే మొక్కజొన్న గింజలు వచ్చాయని, ఇంకా 80 శాతం రావాల్సి ఉందని జమీల్ తెలిపారు. సాధారణంగా, హోల్‌సేల్ మార్కెట్ ఉదయం 5 నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మొక్కజొన్న సీజన్ ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుందని తెలిపారు. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు ఎక్కువగా అమ్ముడవుతాయని వ్యాపారులు తెలిపారు. రైతులకు, వినియోగదారులకు నష్టం వాటిల్లకుండా ధరలను నిర్ణయిస్తామని హోల్‌సేల్ మేనేజర్లు తెలిపారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌, అబిడ్స్‌, దిల్‌షుక్‌నగర్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, బేగంపేట మార్కెట్లలో రద్దీగా ఉండే మొక్కజొన్న కంకుల సందడి నెలకొంది. కొంతమంది ఉడికించుకుని తింటుంటే, మరికొందరు వేయించి, మరికొందరు రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి కంకులను తీసుకుంటున్నారు. ఏది ఏమైనా వాన కాలంలో టీ,కాఫీ, ఎంత బాగుంటుందో.. కంకులు కూడా కాల్చుకుని తింటుంటే ఆ మజానే వేరబ్బా అంటున్నా కొనుగోలు దారులు.
Dog Breeding: ఇంట్లో కుక్కలను పెంచుకోవడమే కాదు.. ఇవి కూడా చేయాలి..

Show comments