MLC Kavitha: నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడి కస్టడీ ముగియనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఈడి అధికారులు కవితను హాజరు పర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 15న హైదరాబాదులో లిక్కర్ కేసులో కవితను ఈడి అరెస్ట్ చేశారు. ఈడి కస్టడీలో లిక్కర్ స్కాంలో అధికారులు కవిత పాత్రపై ఇంటరాగేషన్ చేశారు. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు నిందితులు అరెస్టై వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల వాంగ్మూలాలపై ఈడి అధికారులు కవిత నుంచి క్లారిటీ తీసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తో కలిపి విచారించేందుకు మరో రెండు రోజుల కస్టడీ పొడగించాలని కోర్టును ఈడి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రెండు వాదనలను రోస్ అవెన్యూ కోర్టు ఇవాళ వినే అవకాశం ఉంది. మరోసారి కవితను ఈడీ కస్టడీకి ఇస్తారా? లేక జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు ఇస్తుందా? రెండూ లేకుండా బెయిల్ మంజూరు చేస్తుందా? అనే అంశాలపై ఇవాళ స్పష్టత వస్తుందని అంటున్నారు.
Read also: Sreeleela : అదిరిపోయే లుక్ లో శ్రీలీలా కిర్రాక్ పోజులు..
ఇప్పటివరకు కస్టడీలో ఉన్న కిక్ బ్యాక్‌ల గురించి కవితను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వందల కోట్లు చేతులు మారాయని ఈడీ చెబుతోంది. ఈ విషయంపై మరింత లోతైన ప్రశ్నలు వేయాల్సి ఉందని అంటున్నారు. నలుగురు వ్యక్తుల వాంగ్మూలాలను కవిత నుంచి అడిగామని ఆమెకోర్టుకు తెలిపారు. డాక్టర్ చెప్పినట్లు కవితకు మందు ఇస్తామని ఈడీ చెబుతోంది. సమీర్ మహేంద్రుడితో పాటు కవితను కూడా విచారించాలని ఈడీ తెలిపింది. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వావిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు, పీఏ శరత్ నిన్న రాత్రి కలిశారు. కవితతో సుమారు గంటపాటు మాట్లాడారు. కవిత భర్త అనిల్ తొలుత ఆమె యోగక్షేమాలు అడిగి ఆమెకు ధైర్యం చెప్పినట్లు సమాచారం. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని వావిరాజు రవిచంద్ర హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ కవితను కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో న్యాయవాది మోహిత్ రావు ఆమెతో పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఆమె పీఏ శరత్ కూడా పాల్గొన్నారు.
MS Dhoni: ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు!
