NTV Telugu Site icon

Sangareddy: కనువిందు చేసిన జింకలు.. పచ్చిక బయళ్ల మధ్య విన్యాసాలు

Sangareddy Deers

Sangareddy Deers

Sangareddy: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇస్తూ విద్యాశాఖ గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

Read also: Hyderabad: మధురానగర్‌ లో దారుణం.. లిఫ్ట్‌ ఇచ్చి కారులో మహిళపై అత్యాచారం

కాగా వర్షాల కారణంగా నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం మైకోడ్ గ్రామంలో 50కి పైగా జింకలు ప్రత్యక్షమయ్యాయి. భారీ వర్షాల కారణంగా పచ్చని చెట్ల మధ్య జింకలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వానలతో పొలాలు పచ్చని వాతావరణం నెలకొంది. అయితే అడవులనుంచి పశ్చని బయళ్లపై చెంగు చెంగు మంటూ ఎగురుతూ వచ్చిన జింకలను చూసి స్థానికులు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు జింకను చూసి సెల్ ఫోన్లలో బంధించారు. చాలా రోజుల తర్వాత పొలాల మధ్య జింకలు చేస్తున్న విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రకృతిని ఆస్వాదిస్తూ పచ్చని పొలంలో జింకల గుంపు చెంగు చెంగుమంటూ ఉరకలు వేయడం ప్రతి ఒక్కరి కళ్లకు ఆనందాన్ని కలిగించింది.
Supreme Court On Rahul Gandhi: రాహుల్‌ పిటిషన్‌ విచారణ.. ప్రతివాదులకు సుప్రీం నోటీసులు