Site icon NTV Telugu

Godavari Floods: శాంతించిన గోదావరి.. భద్రాద్రి వద్ద తగ్గుతున్న ప్రవాహం

Godavari Floods

Godavari Floods

రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ముంచెత్తడంతో.. వరదలతో రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంబించింది. దీంతో ప్రజలు నిలవనీడలేకుండా రోడ్డునపడ్డారు. ఇక భద్రాచలంలో గోదారి ఉగ్రరూపం దాల్చింది. వరద నీటితో భద్రాద్రి ఆలయ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మరో ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. అయితే రెండు రోజుల నుంచి
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు తగ్గుతూ వస్తుంది. రెండు వారాల నుండి ఎగువ నుంచి వచ్చిన భారీ వరదల వల్ల భద్రాచలం వద్ద 71.3 అడుగులకు చేరుకుంది, అది ఇప్పుడు తగ్గుతూ వచ్చి 43.7 అడుగుల వద్ద ఉంది. ఈనెల 11 నుంచి గోదావరి వరద తీవ్ర రూపం దాల్చినప్పటికీ గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. 53 అడుగులకు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక, 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక, 43వ అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద జారీ చేయటం అనేది నిబంధనలు వున్నాయి.

అయితే ఇప్పుడు 40.7 అడుగుల వద్ద ఉన్నప్పటికీ ఇంకా మూడవ ప్రమాద హెచ్చరికనే కొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద 71.3 అడుగుల వరకు వచ్చి ఆ తర్వాత గోదావరి తగ్గుముఖం పట్టింది అయితే ఇది చాలా స్వల్పంగా తగ్గుతూ వచ్చింది .ఎగువ నుంచి ఇప్పటికి వరద వస్తూనే ఉందనీ ఇందువల్లనే ప్రమాద స్థాయి మించి వరద వస్తుందని ఆందోళనతో జిల్లా అధికార యంత్రాంగం గోదావరి వద్ద మూడవ ప్రమాద హెచ్చరికను తొలగించడం లేదనీ చెబుతున్నారు. ఇప్పటికి గోదావరి వేగంగా ఉండటంతో రామాలయం సమీపంలోని స్నానాలు ఘట్ట వద్ద భక్తులకి అనుమతి ఇవ్వటం లేదు. రామాలయం చుట్టుపక్కల పూర్తిగా క్లీన్ కాగా నీటిని అంతా గోదావరిలోకి పంపింగ్ చేశారు. రామాలయం సమీపంలో స్నానాల గ ట్టు వద్ద పారిశుధ్య సిబ్బంది క్లీనింగ్ చేశారు 43.7 అడుగుల దగ్గర ఉన్నప్పటికీ ఇంకా మూడవ ప్రమాద హెచ్చరికని అధికారులు కొనసాగిస్తున్నారు.

Polio Virus Case in America: అమెరికాలో పోలియో వైరస్‌ కేసు.. న్యూయార్క్ ఆరోగ్య శాఖ వెల్లడి

Exit mobile version