NTV Telugu Site icon

Dead Body in Sack: రంగారెడ్డిలో దారుణం.. గోనె సంచిలో మృతదేహం..

Rangareddy Dead Body

Rangareddy Dead Body

Dead Body in Sack: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మృతదేహం కలకలం సృష్టించింది. బ్రాహ్మణ పల్లి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు మృత దేహాన్ని గోనె సంచిలో చుట్టి ఓఆర్‌డి పై నుంచి కింద పడేశారు. బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాగ్‌లో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం కనిపించింది. మృతుడు మగవాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. అతడి వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు చేరుకుని ఆధారాల కోసం గాలిస్తున్నారు. అయితే ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తెచ్చి పడేశారా? లేక ఇక్కడికే వచ్చి చంపేసి గోనె సంచిలో కుక్కి పడేశారా? అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృత దేహం ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Read also: The Raja Saab: ఆ కటౌట్ కి ఆ మాత్రం సెలబ్రేషన్స్ చేయాల్సిందేలే…

కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉండటంతో ముఖం స్పష్టంగా లేదని తెలిపారు. పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. రిపోర్ట్ వచ్చాక దర్యాప్తు ముమ్మరం చేస్తామని తెలిపారు. మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఒక వేళ కుటుంబసభ్యులే చంపేసి ఏమీ తెలియనట్లు మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఇక్కడకు తెచ్చి పడేశారా? అనే కోనంలో విచారణ చేపట్టారు. ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాంతంలో గెనె సంచి ఉందనేది ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు దుండిగల్ లోని సూరారం జ్యోతి డైరీ పాల కంపెనీ రోడ్ ప్రక్కన ఒక యువకుడి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని దుండిగల్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
North Korea: మాకు యుద్ధం చేసే ఉద్దేశం లేదు.. కానీ, దక్షిణ కొరియాతో ఏకీకరణ సాధ్యం కాదు..