Babies in the canal: కన్న పేగు కర్కశంగా మారింది. నవమాసాలు కని కన్నపేగు తెంచుకుని బయట ప్రపంచంలో వచ్చిన ముక్కుపచ్చలారని శిశులను సైతం చంపేందుకు వెనుకాడటం లేదు. ఆతల్లికి శిశువులు భారమని పించి చంపేసిందో లేక అనారోగ్యంతో చనిపోవడంతో దూరం చేసుకుందో తెలియదు. లేక విలాసవంతమైన జీవితం గడిపేందుకు చిన్నారి అడ్డుగా ఉన్నారని అనుకుందో 7 నెలల నవజాతి శిశువులను చీరలో కట్టేసి కాలువలో పడేసింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారులను నిద్రపుచ్చేందుకు కట్టే చీర దహన సంస్కారాలకు ఉపయోగించినట్లు ఉపయోగించింది. ఆ ఇద్దరు చిన్నారులు చంపేసి అందులో కట్టిందంటే అసలు ఆమె తల్లేనా? అమ్మా మేము ఏం పాపం చేసాం అంటూ ఆ శిశువు మనసులో మాటను సైతం ఆతల్లి అర్థం చేసుకోలేకపోయింది. అమ్మ ఆకలేస్తుంది అనే పదం కూడా మాట్లాడలేని మాకు కనింది ఎందుకు చంపింది ఎందుకు తల్లి అంటూ ఆ అభాగ్యుల చూపుకూడా ఆతల్లికి కరువైంది. ఇలాంటి ఘటన ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Vandebharat: తెలుగు రాష్ట్రాల వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. రాకపోకల్లో ఆలస్యం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మురుగు కాలువలో 7 నెలల నవజాత మృతదేహాలు కలకలం రేపింది. బతుకమ్మ కుంట కాలనీలో మురుగు కాలువలో ఏడు నెలల వయసు గల నవజాత కవలల ఆడ, మగ మృతదేహాలు లభ్యం కావడంతో బతుకమ్మకుంట కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓ వస్త్రంలో ఇద్దరిని కట్టి కాలువలో గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. మురుగు కాలువ ఒడ్డు పైన నవజాత శిశువుల మూటను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నవజాత మృతదేహాలను స్థానిక గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
