Site icon NTV Telugu

Telangana Hemo Lab: హీమో ల్యాబ్స్ కి నో పర్మిషన్.. డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ఆదేశాలు

Musapet Himolabs

Musapet Himolabs

Telangana Hemo Lab: హీమో ల్యాబ్ కి ఎలాంటి అనుమతులు లేవని డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ సౌభాగ్య లక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. మనుషుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న ముఠాను పట్టుకున్నామన్నారు. మనుషుల రక్తాన్ని సొమ్ము చేసుకుంటోందన్నారు. ముసాపేట బాలాజీనగర్ లోని హీమో ల్యాబొరేటరీస్ లో సోదాలు జరిపామన్నారు. అక్రమంగా బ్లడ్, ప్లాస్మా, సీరం నిల్వలు గుర్తించామన్నారు. ప్లాస్మాను బ్లాక్ మార్కెట్ లో వేల రూపాయలకు అమ్ముకుంటున్నారని తెలపారు. రాఘవేంద్ర నాయక్‌ ఎనిమిదేళ్లుగా ఈ దందా చేస్తున్నాడని తెలిపారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నాడని అన్నారు. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఉన్న శ్రీకర హాస్పిటల్‌ బ్లడ్‌ బ్యాంక్, దారు ఉల్‌ షిఫాలోని అబిద్‌ అలీఖాన్‌ లయన్స్‌ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్‌ బ్లడ్‌ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్‌లో ఉన్న ఆర్‌ఆర్‌ హాస్పిటల్‌ బ్లడ్‌ బ్యాంకుల నుంచి అక్రమంగా బ్లడ్ సేకరిస్తున్నట్లు గుర్తించామన్నారు.

Read also: Hungry Cheetah: ఈ పవర్ ఫుల్ టైటిల్ పవర్ స్టార్ కోసమేనా?

హీమో ల్యాబ్ కి ఎలాంటి అనుమతులు లేవన్నారు. యూనిట్‌ రక్తాన్ని 700కు కొని 3,800 కు విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు తెలిసిందన్నారు. విశాఖపట్నంలోని ఆక్టిమస్‌ బయోసైన్స్, హైదరాబాద్‌ ఐడీఏ బొల్లారంలోని క్లియాన్స్‌ ల్యాబ్స్, పుణేలోని క్లినోవి రీసెర్స్‌ ప్రై.లిమిటెడ్, బెంగళూరులోని జీ7 సినర్జీస్‌ ప్రై.లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్‌ క్లినికల్‌ సర్విసెస్‌ ప్రై.లిమిటెడ్, ఐడీఏ మల్లాపూర్‌లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనగూడలోని జెన్‌రైస్‌ క్లినికల్‌ ప్రై.లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్‌టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌లకు ప్లాస్మా ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాడని వెల్లడించారు. మూసాపేట భవానీనగర్‌లోని ‘హీమో సర్వీస్‌ లేబొరేటరీస్‌’లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నివాస భవనంలో డీసీఏ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే..
Buddha Venkanna: కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడిన బుద్దా వెంకన్న

Exit mobile version