Site icon NTV Telugu

కేటీఆర్ కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధ ప్రాతిపాదికన విడుదల చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇస్తామన్న వరద సాయం ఏ కారణం చేత ఇంకా ఇవ్వడం లేదని ప్రశ్నించిన దాసోజు శ్రవణ్… దాదాపు 5లక్షమంది అక్టోబర్ 2020 వరద బాదితులు నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు దాసోజుశ్రవణ్. గత కొద్ది రోజులు కురుస్తున్న వర్షాలు కారణంగా దాదాపు 200 కోట్ల రూపాయిల నష్టం జరిగినట్టు ప్రాధమిక అంచనా వేయగా… ఈ నష్ట పరిహారాన్ని ఎప్పుడు చెల్లిస్తారని నిలదీసారు దాసోజు శ్రవణ్. నాళాల వైడింగ్, స్ట్రాటజిక్ నాళా డెవలప్మెంట్ ని ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేసి వరదల నుంచి హైదరాబాద్ ని కాపాడుతారని కేటీఆర్ ను ప్రశ్నించారు.

Exit mobile version