Site icon NTV Telugu

Dasara Holidays 2022: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా సెలవులు 15 రోజులు

Dasara Holidays

Dasara Holidays

విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో పరీక్షలు జరుగుతుండగా.. దసరా పండు దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. దసరా సెలవులను ముందుగానే నిర్ణయించింది.. అక్టోబర్‌ 5వ తేదీన విజయ దశమి ఉండగా.. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అంటే.. దసరా పండుగ సెలవులు ఈ నెల (సెప్టెంబర్)‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు ఉంటాయని ప్రకటించింది.. అయితే, ఈ నెల 25వ తేదీన, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో ఈ ఏడాది మొత్తంగా దసరా సెలవులు 15 రోజుల పాటు రాబోతున్నాయి.. అంటే.. ఈ నెల 24వ తేదీన స్కూళ్లు మూత బడితే.. తిరిగి అక్టోబరు 10న తెరుచుకోనున్నాయి.. కాగా, తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు.. ముఖ్యంగా తెలంగాణలో ఈ పండకు ప్రత్యేక స్థానం ఉంది.. బతుకమ్మలతో ఆడపడులు.. చిన్నా పెద్ద మమేకమై పల్లెనుంచి పట్టణం దాకా ఉత్సాహంగా జరుపుకుంటారు.. మరోవైపు దుర్గామాత పూజలు.. ఆ తర్వాత విజయ దశమి.. ఓ ఉత్సాహమైన వాతావరణంలో జరిగే విషయం తెలిసిందే.

Read Also: KTR Meets VRAs: ఆందోళన విరమించండి.. ఈనెల 20న మరోసారి చర్చిద్దాం

Exit mobile version