Site icon NTV Telugu

కరోనాతో అన్ని వ్యవస్థలు కూలిపోతాయనుకున్నాం: జయేష్‌ రంజన్‌

కరోనాతో అన్ని వ్యవస్తలు కూలిపోతాయనుకున్నామని, కానీ స్టార్టప్‌లు మరింత పుంజుకున్నాయని తెలంగాణ ఐటీ ప్రన్సిపల్‌ సెక్రటరీ అన్నారు. యూని కార్న్‌ కంపెనీగా మారిన హైద్రాబాద్‌కు చెందిన డార్విన్‌ బాక్స్‌ స్టారప్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సక్సెస్‌ మీట్‌లో జయేష్‌ రంజన్‌, డార్విన్‌ బాక్స్‌ వ్యవస్థాపకులు, రోహిత్‌, చైతన్య కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్‌ మాట్లాడారు. ఇండియాలో స్టార్ట్‌అప్‌ల పురోగతి చాలా వేగంగా నడుస్తోందన్నారు.

Read Also: గుడివాడ ఏమన్నా పాకిస్తానా..?: బుద్ధా వెంకన్న

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో 300లకు పైగా స్టార్టప్‌ సంస్థలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మొదలైన డార్విన్ బాక్స్‌ కంపెనీ యూనికార్న్‌ అవ్వడం మంచి విషయమన్నారు. హైదరాబాద్‌లో ఉన్న లెంట్‌ స్థిరంగా ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితులు బయట ప్రాంతాల్లో అంతగా ఉండవన్నారు. సమస్యలు పరిష్కరించడంలో మీ దగ్గర టాలెంట్ ఉంటే మీ దగ్గరకు ఫండ్స్ నడుచుకుంటూ వస్తాయని జయేష్‌ రంజన్‌ అన్నారు.

Exit mobile version