Site icon NTV Telugu

Danam Nagender : రేవంత్ రెడ్డివి పగటి కలలే..

Danam

Danam

తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నేతలను ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే నిన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కౌంట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. కులాలను, మతాలను రెచ్చగొట్టే కుట్ర తెలంగాణలో జరుగుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. మేము ఉమ్మడి ఏపీలో మంత్రులుగా ఉన్నాము.. కానీ ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి చూస్తే మేమే తలదించుకునేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో అభివృద్ధి రేవంత్‌కు కనిపించడం లేదా.? అని ఆయన ప్రశ్నించారు.

కుల, మతాలకు అతీతంగా కేసీఆర్ పాలన చేస్తున్నారన్న దానం.. రేవంత్ అధికారం కోసం ఆరటపడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోని ఇతర సామాజిక వర్గాల నేతలు ఎందుకు మాట్లాడడం లేదు.? ఎందుకు ముగాబోయారు.? అని వ్యాఖ్యానించారు. రేవంత్ కులాల కామెంట్స్ పై భట్టి, మధు యాష్కీ ఇతర నేతలు ఎందుకు మాట్లాడం లేదు…అమ్ముడు పోయారా ? అంటూ ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలను ఆపాలని, కులలపై మాట్లాడితే బలి పశువు అయ్యేది రేవంత్ రెడ్డే… రేవంత్ రెడ్డి ఎవరి ఏజెంటో కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.

Exit mobile version