Kandala Upender Reddy: ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పై ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం దళిత వర్గాలు అసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులకు సంబంధించిన వారికి పదవులు కేటాయించడంలో అదేవిధంగా దళిత అధికారులను విషయంలో వేధింపులకు గురి చేస్తున్నారని దళిత వర్గాల ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎస్.ఐ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం లో అగ్రవర్ణ సామాజిక వర్గానికే రాజకీయంగా, అధికారిక పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తూ..వేధింపులకు పాల్పడ్డ పోలీసు అధికారులను వెనకేసుకు వస్తున్న కందాలా ఉపేందర్ రెడ్డిపై తీవ్రంగా మండిపడుతున్నారు. అదేవిధంగా కొంతమంది దళిత నాయకులకి పోస్టింగులు ఇచ్చినప్పటికీ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.
Read also: West Bengal: రాత్రికి రాత్రే కోటీశ్వరులైన కూలీ.. ఒకటి కాదు రెండు కాదు 100కోట్లు
నియోజకవర్గంలోని దళిత అధికారులను ఇక్కడ నుంచి బదిలీ చేశారని, ఆ స్థానంలో అగ్ర కులస్థులకు పోస్టింగ్ లు ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది దళితులు మారెమ్మ గుడిలో సమావేశం అయ్యారు. పాలేరు నియోజకవర్గంలో దళితులకు సముచిత స్థానం కల్పించడం లేదని పార్టీ పదవుల్లో నామినేట్ పదవుల్లో కూడా అవకాశం కల్పించడం లేదంటూ బిఆర్‌ఎస్ పార్టీ చెందిన పాలేరు నియోజకవర్గంలోని దళితులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గం లో అత్యధికంగా యస్. సి ఓటర్ల ఉన్న నియోజక వర్గం అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే దళితులను చిన్నచూపు చూస్తూ.. అవమానాలకు గురిచేస్తున్నారని ఉన్న పదవులు కూడా తీసేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.
Kollywood: కాస్త ఆగండి సర్… అందరికీ కావాలంటే అవ్వదిక్కడ