Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

Sridhar Babu

Sridhar Babu

Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు లైఫ్ సైన్సెస్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ‘ASB Biotech International Conference 2025’లో ఆయన కీలకోపన్యాసకుడిగా ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ ఆహ్వానించారు.

Saidabad Case : సైదాబాద్ జువైనల్ హోంలో మరో లైంగిక దాడి వెలుగులోకి

దేశంలో ఈ గౌరవాన్ని పొందిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. సదస్సు అక్టోబర్ 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరుగనుంది. ఈ సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు గత రెండు సంవత్సరాల లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిపై ప్రసంగించనున్నారు. అంతేకాక, తెలంగాణలో ఈ రంగంలో ఉన్న అనుకూలతలు, పెట్టుబడుల అవకాశాలు మరియు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంలో గల అవకాశాలపై కూడా ఆయన మాట్లాడనున్నారు.

Exit mobile version