NTV Telugu Site icon

Cyber Cheaters: ఓఎల్ఎక్స్ లో కుర్చీ అమ్మకానికి పెడితే.. లక్షలు కాజేసి కుచ్చిటోపి పెట్టాడు..!

Cyber Cheater

Cyber Cheater

Cyber Cheaters: టెక్నాలజీ అనేది మన రోజు వారి జీవితంలో భాగమైంది. దీని వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు, నేరాలు, వేధింపులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే జీవితాలు ప్రమాదంలో పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఎక్కడో ఓ చోట ఆన్ లైన్ మోసాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇదే తరహా మోసం వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రి వైద్యున్ని సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. నిమ్స్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఒక వైద్యుడు తన ఎలక్ట్రిక్ చైర్‌ను సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ OLXలో అమ్మకానికి పెట్టాడు. అది చూసిన సైబర్ నేరగాళ్లు జితేంద్ర శర్మ పేరుతో డాక్టర్‌కు ఫోన్‌ చేశారు. కాల్ చేసిన వ్యక్తి తనను జితేంద్ర శర్మగా పరిచయం చేసుకొని కూకట్‌పల్లిలో ఫర్నీచర్ షాపు ఉందని, కుర్చీ కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కుర్చీ కొనుగోలు కోసం డబ్బు పంపేందుకు తన క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలని సూచించాడు. దీన్ని నమ్మిన వైద్యుడు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగా.. అతని ఖాతా నుంచి రూ.2.58 లక్షలు మాయమయ్యాయి. మోసపోయానని గ్రహించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Hyderabad: రామాంతపూర్ లో విషాదం.. షెటిల్‌ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..

తాజాగా జూన్ లో ఈజీ మనీ సంపాదించుకోవచ్చనే ఆశ చూపిస్తూ.. హైదరాబాద్‌ కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.87లక్షలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. హైదరాబాద్ నగరంలోని సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అస్మాబాద్‌ కు చెందిన ఓ వ్యక్తికి ఆన్‌లైన్‌లో రాండీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనని తాను ఆస్ట్రేలియా కంపెనీ హైపర్‌వర్త్‌ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే.. అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పాడు. అతడి నుంచి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టించాడు. మొదట్లో లాభాలు ఇస్తూ నమ్మకం కలిగేలా సదరు సైబర్ నేరగాడు.. ఈ క్రమంలో ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే.. ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని నమ్మించాడు.. దీంతో ఆ బాధితుడు ఏకంగా రూ.50లక్షలు ఒక్కసారిగా పెట్టుబడి పెట్టాడు. ఇదే సమయంలో మరో బాధితుడికి మయాంక్‌ అనే వ్యక్తి పరిచయమ్యాడు. ఆ వ్యక్తికి కూడా ఇదే తరహాలో లాభాలను చూపాడు. అతడిని కూడా నమ్మించి.. రూ.12 లక్షలను పెట్టుబడిగా పెట్టించుకున్నాడు. వారు పెట్టుబడి పెట్టిన మరుక్షణం నుంచి ఇటు రాండీ గానీ, అటు మయాంక్‌ గానీ స్పందించలేదు. దీంతో తాము మోసపోయానని గ్రహించిన బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Viral Video: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు