NTV Telugu Site icon

Ice Cream: కాటేదాన్‌లో కల్తీ ఐస్ క్రీమ్.. సైబరాబాద్ ఎస్ఓటీ అదుపులో నకిలీ ముఠా

Ice Cream

Ice Cream

Ice Cream: డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు దుర్మార్గులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అత్తాపూర్ లో కల్తీ ఐస్‌ క్రీమ్‌ తయారీ చేస్తున్న ముఠా గుట్టును మాదాపూర్‌ ఎస్ఓటీ పోలీసులు అదుపులో తీసుకున్న ఘటన మరువకముందే.. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో కల్తీ ఐస్ క్రీమ్ కలకలం రేపింది. మార్కెట్ లో డిమాండ్ వున్న బ్రాండెడ్ ఐస్ క్రీం కవర్ లతో నాసిరకం ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్టు పోలీస్ లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ప్రమాదకరమైన రసాయనాలు వాడి ఐస్ క్రీముల తయారీలో టేస్ట్ పెరగడానికి ప్రమాదకరమైన పౌడర్ ఉపయోగం చేస్తున్నారని తెలిపారు. తయారు చేసిన ఐస్ క్రీములకు స్టికరింగ్ చేసి మార్కెట్ లో విక్రయం చేస్తున్నట్లు గుర్తించారు. మనుషుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని, ధనార్జనే ధ్యేయంగా కల్తీలకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఈ ఘటన కాటేదాన్‌ లో వెలుగులోకి రావడంతో వినియోగ దారుల్లో భయాందోళన చెందుతున్నారు.

Read also: Rashmika Mandanna: దారుణంగా మోసపోయిన రష్మిక.. క్షణాల్లో సంచలన నిర్ణయం!

రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో కల్తీ ఐస్ క్రీమ్ ల తయారీ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ ఐస్ క్రీముల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ ఐస్‌ క్రీమ్‌ తయారు చేసిన ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి మార్కెట్ లో విక్రయయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమ చలామణి చేస్తున్నట్లు, కల్తీ ఐస్ క్రీములు విక్రయిస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రీడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేకుండా దర్జాగా పరిశ్రమ నిర్వహణ చేస్తున్నారని అన్నారు. విశ్వనీయ సమాచారంతో నకిలీ ఐస్‌ సంస్థపై రైడ్‌ చేయడంతో అసలు గుట్టు రట్టైందని అన్నారు.

ఈ దాడుల్లో ఒకరి అరెస్ట్ చేసి నిందితుడిని మైలార్ దేవిపల్లి పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలు టార్గెట్ చేసి ఐస్‌ క్రీముల విక్రయం చేస్తూ యజమానులు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. డబ్బులు ఏమో యజమానులకు రోగాలు ప్రజలకు అని పోలీసులు వ్యాఖ్యానించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు మాత్రం కల్తీ పరిశ్రమల పై కన్నెతి చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు. పరిశ్రమ యజమానులతో కుమ్మక్కై మూడు పువ్వులు ఆరు కాయలుగా నకిలీ దందాలు కొనసాగిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవి సీజన్‌ లో చల్లడి ఐస్‌ క్రీమ్‌ తినిలని పిస్తుంది అలాంటిది ఇలా నకిలీ ఐస్‌ క్రీమ్‌ తో ఆనారోగ్య పాలైతే పరిస్థితి ఏంటని భయంగా వుందని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటికి ఇంకా జరక్కుండా చూడలని అధికారులకు కోరుతున్నారు.
Dil Raju : ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు ఊహించిందే జరిగిందా…?

Show comments