NTV Telugu Site icon

Cyber criminals: సిద్దిపేటలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు.. ఒకే రోజు ఆరు ఘటనలు

Cyber Criminals Are Rampant In Siddipet District

Cyber Criminals Are Rampant In Siddipet District

Cyber criminals are rampant in Siddipet district: ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓటిపి అనే దాన్ని చెప్పి, దాని ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఎత్తులకు సైబర్ కేటుగాళ్లు పైఎత్తులు వేసి ప్రజల డబ్బును దోచుకుంటున్న తీరు ఇది. డిజిటల్‌ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని.. సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. బ్యాంకు లావాదేవీల్లో ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించేందుకు ఎత్తులకు పైఎత్తులు వేసి డబ్బుల్ని కొట్టేస్తున్నారు.ఇప్పుడు ఈ తరహాలో మోసాలపై ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా సైబర్ క్రైమ్ పోలీసులకు వస్తున్నాయి. వరుసగా ఇలాంటి ఫిర్యాదులు వస్తుండడంతో జంటనగరాల్లోని పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆన్‌లైన్‌ చీటింగ్‌లపై మరింతగా అవగాహన కల్పిస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నార వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు సైబర్‌ కేటుగాళ్లు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నా ప్రజలు మాత్రం ఇలాంటి సైబర్‌ కేటుగాళ్ల చేతుల్లో మోసపోతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Read also: Fire Accident: నాచారంలో అగ్ని ప్రమాదం.. వారం రోజుల్లోనే మరో ఘటన..

సిద్దిపేటలో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకే రోజు ఆరు ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వేర్వేరు ఘటనల్లో బాధితుల నుంచి 4 లక్షల 74 వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసారు. బాధితుల ఫిర్యాదుతో 69 వేల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేసారు. గత కొన్ని రోజులుగా సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న సైబర్ నేరాలు మాత్రం తగ్గడం లేదు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకున్న వారిని మోసం చేస్తూ లక్షల్లో కాజేస్తున్నారు కేటుగాళ్లు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీసులు సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోకండి అంటూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తులు చేస్తున్న క్రమంలో మరో తరహా మోసాలు బయటపడుతున్నారు. దీంతో బాధితులను అవగాహన కల్పిస్తు ఒకపక్క, మరో పక్క సైబర్‌ నేరగాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు. ఏదైమైనా సిద్దిపేట జిల్లాలోనే ఒకేరోజు ఆరు సైబర్‌ నేరాలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.