TS to TG Fake Note: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘టీఎస్’ని ‘టీజీ’గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మార్పు వల్ల ప్రభుత్వ ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ కొందరు ఫేక్ నోట్ ను ప్రచారం చేశారు. టీఎస్ నుంచి టీజీగా పేరు మార్చేందుకు రూ.2,767 కోట్లు ఖర్చవుతుందని సైబర్ నేరగాళ్లు నకిలీ నోటును సృష్టించి ప్రచారం చేస్తున్నారు. అయితే దీన్ని నమ్మిన ప్రజలు అన్ని కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అంటూ నోర్లు వెల్లబెడుతున్నారు.
అయినా టీఎస్ ను టీజీ గా మార్చడానికి అన్ని కోట్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈఫేక్ నోట్ పై స్పందించిన ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ నోట్ లు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు చేపట్టారు. దీనిపై విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ నోట్ సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని, పోలీసులు, ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సూచించారు.
Read also: Election Betting: వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ పెట్టిన సర్పంచ్ ఆత్మహత్య
అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్‌లపై స్టేట్ కోడ్‌గా టీఎస్ స్థానంలో టీజీని అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు తమ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మార్చి నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీకి మారుస్తూ కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దాంతో రాష్ట్రంలోని వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌పై తెలంగాణ కోడ్ టీజీగా మారిపోయింది.
Read also: Telangana DGP: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. తెలంగాణ డీజీపీ పేరుతో ఫేక్ కాల్
కేంద్రం నుంచి పూర్తి ఆమోదం లభించడంతో వాహనాల రిజిస్ట్రేషన్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంబంధిత విషయాల్లో రాష్ట్ర కోడ్ టీఎస్ నుంచి టీజీకి మారింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలోని లెటర్ ప్యాడ్లన్నీ టీఎస్ కాకుండా టీజీగా మారిపోయాయి. తాజా ఉత్తర్వుల్లో ఎలక్ట్రానిక్‌తో పాటు హార్డ్‌కాపీల్లో టీఎస్‌కు బదులుగా టీజీని ఉపయోగించాలి. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాల్లో టీజీగా అప్ డేట్ కావాలని కార్యదర్శులకు సీఎస్ శాంతికుమారి సూచించారు. రాష్ట్ర కోడ్ సంక్షిప్తీకరణను టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, చేసిన మార్పులను ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సాధారణ పరిపాలన శాఖ సంయుక్త కార్యదర్శికి నివేదించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Cyber Crimes: తెలంగాణ DGP పేరుతో బెదిరింపులు.. (వీడియో)