Site icon NTV Telugu

Cyber Attack: మెయిల్‌ ఐడీ హ్యాక్.. మిథానికి రూ.40 లక్షలు టోకరా..

Cyber Attack

Cyber Attack

సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. అవకాశం దొరికితే ప్రతిష్టాత్మక సంస్థలను కూడా వదలడంలేదు.. తాజాగా, హైదరబాద్ కంచన్‌బాగ్ లోని మిధాని సంస్థకు రూ. 40 లక్షలు టోకరా వేశారు సైబర్ క్రైమ్ నేరస్థులు… మిథాని సంస్థ.. కెనడాకు చెందిన నేచురల్ ఆలూ కంపెనీ దగ్గర నుంచి అల్యూమినియం కొనుగోలు చేసింది.. అయితే, అల్యూమినియం కొనుగోలుకు మిథాని సంస్థ కొంత నగదును అడ్వాన్స్ గా చెల్లించింది… నేచురల్ అలూ కంపెనీ ఒప్పందం ప్రకారం మిథాని సంస్థకు అల్యూమినియం అందించింది… అదే అదునుగా చూసుకొని సైబర్ చీటర్స్ .. ఆ సంస్థ చెందిన కెనడా అకౌంట్ కాకుండా అమెరికాకు చెందిన అకౌంట్ నంబర్ ఈ మెయిల్ ద్వారా మిధాని సంస్థకు పంపించారు.. ఈ పరిణామాన్ని గమనించని మిథాని సంస్థ.. నేరగాళ్లు పంపించిన అకౌంట్ కి రూ. 40 లక్షల మిగతా బ్యాలెన్స్ ను బదిలీ చేసింది.. అయితే, నేచురల్ ఆలు కంపెనీ ప్రతినిధులు.. మిగతా బ్యాలెన్స్‌ కోసం మిథానిని సంప్రదించడంతో.. సైబర్ క్రైమ్ నేరగాళ్లు చేతిలో మోసపోయామని గ్రహించిన ఆ సంస్థ.. హైదరబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

Exit mobile version