Site icon NTV Telugu

Kukatpally LuLu Mall: లులు మాల్ ను దోచేసిన కస్టమర్లు.. ఫుడ్డుతో పాటు మొత్తం ఖాళీ

Lu Lu Mall

Lu Lu Mall

Kukatpally LuLu Mall: కూకట్ పల్లిలో లులు మాల్ ను కస్టమర్లు దోచేశారు. అదేంటి కస్టమర్లు అంత పెద్ద మాల్‌ ను దోచేయడం ఏంటని బిత్తరపోతున్నారా. మీరు విన్నది నిజమే నండోయ్‌.. లులు మాల్‌ ను మంత్రి కేటీఆర్‌ నాలుగురోజుల ముందు రిబ్బన్‌ కట్ చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. దీంతో జనాలు లులు మాల్‌కి మూడు రోజులకు పోటెత్తారు. ఇసుకవేస్తే రాలే విధంగా జనాలు అక్కడకు చేరుకున్నారు. కాలుపెట్టే స్థలంకూడా లేనంతగా నగర ప్రజలు లులు మాల్‌ ను చూసేందుకు ఎగబడ్డారు. అయితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా లెక్కచేయలేదు. అసలు కస్టమర్లు ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. మాల్ ఉన్న వస్తువులు ఫుడ్ మొత్తాన్ని తిని పడేస్తూ వెళ్లిపోయారు. ఫుడ్డు తో పాటు కూల్ డ్రింక్స్ సీసాలు మొత్తం ఖాళీ చేసి పడేశారు. కస్టమర్ల ఆగడాలను చూసి యాజమాన్యం విస్తు పోయింది.

ఆదివారం కావడంతో నగరంలోని ప్రజలు లులు మాల్ ను చూసేందుకు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ వున్న సెక్యూరిటీ కూడా వాళ్లను కంట్రోల్ చేయలేకపోయాడు. బైక్ లు, కార్లు కూడా పెట్టడానికి స్థలం లేకుండా పోయింది. ఇదంతా ఒక ఎత్తైతే లులు మాల్ నే కస్టమర్లు విపరీతంగా వాడేసుకున్నారంటే యాజమాన్యం మాత్రం బిత్తరపోయిందంటే నమ్మండి. కస్టమర్లు దేవుళ్లు అనే సామెత ఏమోగానీ.. కస్టమర్లు చేసిన హడావుడికి మాత్రం లులు మాల్ అంతా చెత్త కుండీలా మారింది. లులు మాల్ లో ఎక్కడ చూసిన చాక్లట్ కవర్లు, ఫుడ్ కవర్లు, కూల్ డ్రింక్ తాగేసి ఖాలీ చేసిన బాటిల్లు దర్శనమివవ్వడంతో యజమాన్యం తలలు పట్టుకుంటున్నారు. వామ్మో వీల్లు కస్టమర్లు కాదు.. ఇంతలా రాక్షసంగా ప్రవర్తించారేంటని విస్తుపోయారు. ఇప్పటికైనా ఫుల్ సెక్యూరిటీ పెట్టాలని, కస్టమర్లపై నిఘా పెట్టాలని పట్టిస్టంగా ఉండాలని రూల్స్ పెట్టాలని ఆలోచనలో పడ్డారు. మరి యూఏఈ తరహా లులు మాల్ పెట్టారు సరే కానీ నగరంలోని ప్రజలు మాస్ అని పాపం తెలుసుకోలేక పోయారు. కానీ ఇప్పటి కస్టమర్లకు రూల్స్ మాత్రం లులు మాల్ వెళితే మామూలుగా ఉండదండోయ్ కాస్త జాగ్రత్త మరి.

యూఏఈకి చెందిన లులు గ్రూప్ హైదరాబాద్ లో తొలి మాల్ ను ప్రారంభించింది. కూకట్ పల్లిలో లులు మాల్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ రిబ్బను కట్ చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో లులు మాల్ ను తీర్చిదిద్దారు. 75 దేశీ, విదేశీ బ్రాండ్ స్టోర్లు ఈ మాల్ లో ఉంటాయి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్, ఇలా కావాల్సినవన్నీ ఒకే చోట లభిస్తాయి. సినిమా ప్రియుల కోసం ఐదు స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో 1400 మంది సినిమాలను వీక్షించవచ్చు. నిత్యావసర వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, మాంసం, ఎలక్ట్రానిక్, ఐటీ వస్తువులు, మొబైల్స్, గృహోపకరణాలు ఇలా అన్ని ఈ మాల్ లో లభిస్తాయి. అలాగే పిల్లల కోసం ఎంటర్ టైన్ మెంట్ జోన్ కూడా ఉంటుంది. దేశంలో ఇప్పటికే ఐదు నగరాల్లో లులు మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఆరో నగరమైంది. బెంగళూరు, కోయంబత్తూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో లులు స్టోర్లకు విశేష ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ లులు మాల్ ను రోజుకు 30 వేల మంది సందర్శించవచ్చు. తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులలో భాగంగా లులు మాల్ ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు కస్టమర్లు చేసిన పనికి లులు యాజమాన్యం బిత్తరపోయేలా చేసింది.
Hydrogen Bus: హైడ్రోజన్ బస్సులో టెస్ట్ డ్రైవ్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. పిక్స్ వైరల్!

Exit mobile version