కాలనుగుణంగా సంక్రమించే అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నియంత్రించేందుకు పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
మనం నిత్యం పండ్లు, కూరగాయలను తింటే సరిపోతుంది. అలా మన ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూర్చే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి.
బొప్పాయి మాత్రమే కాక దాని గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణుల చెబుతున్నారు. మనం వేస్ట్ అని బయట పారేసే బొప్పాయి గింజలు అనేక ఆరోగ్యాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి.
బొప్పాయి గింజలను తీసుకుంటే పురుఫుల పునరుత్పత్తి వ్యవస్థకు, శృంగార సామార్థ్యాన్ని మెరుగు పరిచేందుకు కూడా ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.
బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుగా పనిచేస్తాయి.
బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు ఎదురుకావు. శరీర బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
బొప్పాయి గింజలలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా ఋతుక్రమాన్ని ప్రేరేపించడంలో, దాని క్రమబద్ధతను పెంచడంలో ఇవి తోడ్పడతాయి.
బొప్పాయి గింజల్లో ఉండే పాలీఫెనాల్స్.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి అనేక రకాల క్యాన్సర నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్‌కు దూరంగా ఉండాలంటే.. 5, 6 బొప్పాయి గింజల పొడితో టీ చేసుకుని తాగండి.
బొప్పాయి గింజల్లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్, ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.
ఏదైనా పరిమితిగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఆ క్రమంలో బొప్పాయి గింజలను కూడా పరిమితిగానే తీసుకోవాలి. ఇంకా ఒక రోజులో 1 గ్రాము లేదా 5 బొప్పాయి గింజల కంటే ఎక్కువ తినకూడదని నిపుణులు చెబుతున్నారు.