Site icon NTV Telugu

హైకోర్టు నోటీసులపై సీఎస్ సోమేష్ వివరణ.. కావాలనే తప్పుదోవ పట్టించారు !

TS high court

కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు కాదన్నారు సీఎస్ సోమేష్ కుమార్. కోర్టు ధిక్కరణ కేసుల్లో భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని తెలిపిన ఏజీ.. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని వెల్లడించారు సీఎస్ సోమేష్ కుమార్. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందుంచ లేక పోయామన్న సీఎస్.. నిధులు విడుదల చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని కోరారు.

పిల్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు ఏజీ బీఎస్ ప్రసాద్. అయితే.. ఈ వాదనలను విన్న హైకోర్టు… జీవో రాసిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉద్దేశ్యం ఏమిటి? కాగితంపై రాసిందేమిటి? అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమేనన్న విధంగానే జీవో కనిపిస్తోందన్న హైకోర్టు.. జీవో ఎలా రాశారో న్యాయ శాఖ చూడాలి కదా? అని ప్రశ్నించింది. ఇక ఈ కేసును సోమవారం విచారణ జరుపుతామని పేర్కొంది హైకోర్టు.

Exit mobile version