Site icon NTV Telugu

వర్షాలపై కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష…

cs-somesh-kumar

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ వర్ష ప్రాభావిత 20 జిల్లాల కలెక్టర్లతో నేడు సమీక్ష నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ… ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలి. జిల్లాల్లోని అధికారులందరూ కార్యస్థావరంలోనే ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపుగా అన్ని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయి. ఈ నేపథ్యంలో అన్ని జలాశయాలపట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా చెరువుల కట్టల పటిష్టంపై తగు చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే, ఎన్.డి.ఆర్.ఎఫ్. సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సోమేశ్ కుమార్ ఆదేశించారు. ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలపరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

Exit mobile version