NTV Telugu Site icon

Naveen Case:నవీన్ తల్లిదండ్రుల భావోద్వేగం.. చేతిపై అమ్మ అనే టాటూ చూసి గుర్తుపట్టినం..

Naveen Case

Naveen Case

Naveen Case:మృతదేహం మేము అసలు గుర్తు పట్టే స్థితిలో లేకుండా ఉందని, నవీన్‌ చేతిపై అమ్మ అని వున్న టాటూ చూసి గుర్తుపట్టినామని నవీన్‌ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. హత్య కు గురైన నవీన్ స్వగ్రామం వంకరాయి తండా నుంచి ఎన్టీవీ నవీన్‌ తల్లిదండ్రులతో మాట్లాడింది. దీంతో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్‌ మృతితో వాంకరాయి తండా విషాదంలో మునిగిపోయింది. నవీన్‌ ను తలుచుకుని కన్నీరుపెట్టని వారంటూ లేరు. ఆడుతూపాడుతూ అందరితో ఒకరిగా ఉండే నవీన్‌ ఇలా గుర్తపట్టలేనంతగా అవయవాలు కూడా వేరు చేయడంతో నిర్ఘాంతపోయిన నవీన్‌ గ్రామస్తులు ఎంత కష్టమెచ్చిందిరా నాయనా నిన్ను గుర్తుపట్టలేనంతగా చివరి చూపుకూడా నోచుకోలేని పరిస్థితి వచ్చిందంటూ గుండెలు బాదుకుంటురోదిస్తున్నారు. అయితే నవీన్‌ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తన కొడుకు హత్య లో హరిహర కృష్ణ ఒక్కడే ఉన్నాడు అంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నామని వాపోయారు. నవీన్ మిస్ అయ్యాక …హత్య చేసి హరిహర కృష్ణ మాతోనే టచ్ లో వున్నాడని అన్నారు. మృతదేహం మేము అసలు గుర్తు పట్టే స్థితిలో లేకుండా ఉందని, నవీన్‌ చేతిపై అమ్మ అని వున్న టాటూ చూసి గుర్తుపట్టినామని కన్నీరుమున్నీరయ్యారు. హరిహర కృష్ణ కు సహకరించిన హాసన్ , నీహారిక లను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన వెంటనే వీళ్ళు ఇద్దరు తెలిసి కూడా చెప్పలేదని వాపోయారు. చెప్పి వుంటే… కనీసం చివరి చూపు అయినా మాకు దక్కేది అంటూ నవీన్‌ తల్లిదండ్రులు గుండెలు పగిలేలారోదిస్తేంటే గ్రామం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ తల్లి దండ్రులను ఓదార్చేవారే కరువయ్యారు. అయ్యె కొడుకా అంటూ వారి ఆర్తనాదాలు మిన్నంటాయి.

Read also: Warehouse explosion: ముసాపేట గోదాం పేలుడు ఘటనపై యజమాని క్లారిటీ.. మృతుడు నా వద్ద..

ప్రేమకు అడ్డుగా ఉన్న స్నేహితుడు నవీన్‌ను గుండె కోసి శరీరాన్ని ఛిద్రం చేసి హతమార్చిన హరిహరకృష్ణ.. హత్య అనంతరం ఈ విషయాన్ని ప్రియురాలికి చెప్పి ఘటనాస్థలికి చూపించినట్లు విచారణలో తేలింది. మరో స్నేహితుడు కూడా నిందితులకు పూర్తి సహకారం అందించాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుడి స్నేహితుడు హసన్‌, ప్రియురాలు కట్టా నిహారికారెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాకు వెల్లడించారు. కాగా.. నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ స్నేహితుడు హాసన్, ప్రియురాలు నిహారిక రెడ్డిని న్యాయమూర్తి నివాసంలో హాజరు పరిచారు పోలీసులు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. హాసన్ ను చర్లపల్లి జైలు , నీహారిక ను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించనున్నారు పోలీసులు.
CM KCR: రాష్ట్ర, దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు

Show comments