NTV Telugu Site icon

Diamond Jewellery: జూబ్లీహిల్స్ లో కోటి వజ్రాభరణాలు చోరీ.. ట్యాక్సీ డ్రైవర్ పై అనుమానం..

Jubli Hils

Jubli Hils

Diamond Jewellery: జూబ్లీహిల్స్‌లో రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–71లోని నవనిర్మాణ్‌ నగర్‌లో నివసించే బాబ్జీ భాగవతుల అనే రిటైర్డ్‌ ఉద్యోగి తన భార్య శీలతో కలిసి ఈ నెల 20న బెంగుళూరు నుంచి విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. అక్కడ ట్యాక్సీ మాట్లాడుకుని నవనిర్మాణ్‌ నగర్‌లోని తన ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఫిలింఛాంబర్‌ ఎదురుగా విజేత సూపర్‌ మార్కెట్‌ వద్ద ట్యాక్సీ డ్రైవర్‌ కారును ఆపి శుభ్రం చేసుకున్నాడు. కొద్దిసేపటికి వారిద్దరినీ ఇంటి వద్ద దింపడమే కాకుండా కారు డిక్కీలో ఉన్న రెండు సూట్‌కేసులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు.

Read also: Mrunal Thakur : ఆ సీన్ నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది..

కాగా.. ఈ నెల 24న సాయంత్రం బాబ్జీ సూట్‌ కేసుల్లో ఉన్న ఆభరణాలను భద్రపరిచేందుకు చూడగా అందులో ఉండాల్సిన జ్యువెలరీ బాక్స్‌ కనిపించలేదు. ఆ జ్యువెలరీ బాక్స్‌లో మూడు డైమండ్‌ నెక్లెస్‌లు, మూడు జతల డైమండ్‌ చెవి రింగులు ఉన్నాయని, వీటి విలువ రూ.కోటి ఉంటుందని ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ట్యాక్సీ డ్రైవర్‌పై అనుమానం ఉందని, కారును ఆపినప్పుడు డిక్కీలో నుంచి వాటిని తీసి ఉంటాడని, లేదా ఇంట్లోకి సూట్‌కేసులు తెచ్చే క్రమంలో జ్యువెలరీ బాక్స్‌ను చోరీ చేసి ఉండవచ్చునని తెలిపాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆ సమయంలో ట్యాక్సీ ఎవరు బుక్‌ చేశారు, దాని నెంబర్‌ తదితర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
Oppo K12 Launch: ఒప్పో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు అదుర్స్.. ధర?

Show comments