Revanth Reddy: రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి ఓ సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారి నివాసానికి వెళ్లారు. అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపింది. అయితే దీనిపై ఆమె స్పందిస్తూ.. ఇవాల చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. స్మితా అగర్వాల్ చేసిన ట్వీట్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకి అద్దం పడతాయని అన్నారు. సీఎం కార్యదర్శి ప్రాణాలకె రక్షణ లేదు అంటే కేసీఆర్ ఎవరిని కాపాడుతారు? అంటూ చిట్ చాట్ ద్వారా రేవంత్ ప్రశ్నించారు. ఇంటికి తాళాలు వేసుకొని లోపల భయం భయంగా బతకండని స్మిత సబర్వాల్ అనడం రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకపోవడానికి నిదర్శనం అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ ఏమో 100 డయల్ చేయండి అంటారని, కేసీఆర్ ఏమో 100 పేపర్స్ అంటున్నారంటూ ఎద్దేవ చేశారు రేవంత్.
కేసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్ మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ఫలితం ఇది.
సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు… ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే మహిళా ఉన్నతాధికారిణికీ భద్రత లేని పాలనలో ఉన్నాం.
ఆడబిడ్డలూ… తస్మాత్ జాగ్రత్త!@TelanganaCMO @hydcitypolice @TelanganaDGP https://t.co/UjrESVzb7G
— Revanth Reddy (@revanth_anumula) January 22, 2023
మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి ఓ సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారి నివాసానికి అర్ధరాత్రి వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈఘటన జరిగి రెండు రోజులు తరువాత వెలుగులోకి రావడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. అయితే దీనిపై స్పందించారు స్మితా సబర్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ఇంట్లోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారని తెలిపారు. ఆ రాత్రి తనకు భయంకరమైన అనుభవం ఎదురైందని చెప్పాడు. తనను తాను రక్షించుకోవడంపైనే తనదృష్టి సారించినట్లు ఆమె ట్వీట్ వేదికగా చెప్పారు. గట్టిగా కేకలు వేయడంతో.. సిబ్బంది వచ్చారని అలా తనను తను రాక్షించుకోగలిగానని తెలిపారు. ఏ సమయంలో నైనా సరే ధైర్యం కోల్పోకూడదంటూ ధైర్యంగా ఉండలని సూచించారు స్మితా. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నామని ఆలోచించిన ప్రమాదం ఏ సమయంలో వస్తుందో తెలియదు కావును మీరు ఉంటున్న ఇంటికి ఎల్లప్పుడూ తాలుపులు వేసుకుని ఇంటికి వేసిన తాళాలను పరీక్షించుకోవాలని సూచించారు. మీకు ఎలాంటి అనుమానం వచ్చిన 100 నంబర్‌కు డయల్ చేయాలని స్మితా ట్వీట్ చేయడం వైరల్ అవుతుంది.
Che Guevara: హైదరాబాద్ కు చేగువేరా కూతురు, మనవరాలు.. క్యూబా సంఘీభావ సభలో..