హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ no5 లో వ్యభిచారం గుట్టు రట్టైంది. జూబ్లీహిల్స్ రోడ్ no5 లోని శ్రీ పద్మావతి నిలయం అపార్ట్ మెంట్స్ లో గల సీజన్ 4 స్పా లో గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. అయితే.. పక్కా సమాచారం రావడంతో సోమవారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.
రూ.3 వేలు చెల్లిస్తే సెక్స్ వర్కర్ కోరిన సేవలను అందిస్తుందని అక్కడ మేనేజర్ చెప్పడంతో ఆ మేరకు డబ్బు చెల్లించి లోనికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఇద్దరు కస్టమర్లతో సెక్స్ వర్కర్లు వ్యబిచారం చేస్తున్న విషయాన్ని బయట ఉన్న పోలీసులకు సమాచారం అందించారు.
మహిళా పోలీసుల సాయంతో దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకురాలు మీరా సేన్ అలియాస్ సౌమ్య (30) తో పాటు రిసెప్షనిస్ట్ సరిత(42), ఇద్దరు కస్టమర్లు జిలానీ, సుబ్రమణ్యం లను అరెస్ట్ చేసారు. అక్కడ ఉన్న 7 మంది సెక్స్ వర్కర్స్ ను కాపాడి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెసిడెన్షి వాసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఈ స్పా సెంటర్ నడుస్తుందని అన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఈ స్పా సెంటర్ రన్ చేస్తున్నారని తెలిపారు. ఇక్కడికి అమ్మాయిలు, అబ్బాయిలు వస్తున్నారు, ఈ స్పా సెంటర్ వలన మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, ఇది ఫ్యామిలిస్ వుండేటటువంటి ఏరియా.. డ్రైనేజీ లో కండోమ్స్ ప్యాకెట్లు వస్తున్నాయని,
చిన్నపిల్లలు,మహిళలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ స్పా సెంటర్ కి రామిరెడ్డి అనే వ్యక్త. చాలా సార్లు రెసిడెన్సీ మీటింగ్స్ లో రామిరెడ్డి కి చెప్పిన ఫలితం లేకుండా పోయిందని, ఏమి చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించాడని అన్నారు. ఇలాంటి స్పా సెంటర్లను నడిపిస్తున్న నిర్వాహకులు, రెంట్ ఇచ్చేటటువంటి వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని రెసిడెన్షి వాసులు పోలీసులకు తెలిపారు.
కాగా.. 19 Mar 2022న ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువకుడు అక్కడి పోలీసులకు చిక్కాడు. నగరానికి చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే యువకుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. తక్కువ సమయంలో భారీగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో తప్పుదారి పట్టాడు.
ఈ క్రమంలోనే గోవాకు వెళ్లి అక్కడ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పనాజీకి సమీపంలోని సంగోల్డా గ్రామంలోని ఓ హోటల్‌లో ఈ దందా సాగుతున్నట్లు గోవా క్రైమ్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. ఓ పోలీసు అధికారి విటుడిగా ఫోన్ చేయగా హఫీజ్ అన్ని వివరాలు చెప్పేసి ఇరుక్కున్నాడు,
ఆ వివరాల ప్రకారం గోవా పోలీసులు శుక్రవారం వ్యభిచారం స్థావరంపై దాడులు చేసి హఫీజ్‌ని అరెస్ట్ చేశారు. ముగ్గురు యువతులకు విముక్తి కల్పించి రక్షిత గృహానికి పంపించారు. సెక్స్ వర్కర్లలో ఒకరు ముంబయికి చెందిన టీవీ యాంకర్‌గా గుర్తించారు. మిగిలిన ఇద్దరు యువతుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. హఫీజ్ బిలాల్ ముగ్గురు యువతులను గోవాకు తీసుకువచ్చి వారితో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడని వెల్లడించారు.
