Site icon NTV Telugu

Cricket Betting: హైదరాబాద్‌ లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా.. అరెస్టైన వారిలో ఏపీకి చెందినవారే..

Criket Betting

Criket Betting

Cricket Betting: ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి భవనిపురం కాలనీ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు ముఠా పాల్పడుతున్నారనే పక్క సమాచారంతో చందానగర్,మాదాపూర్ SOT పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గుంటూరు కు చెందిన ప్రధాన నిర్వాహకులు బాలాజీ, రవి తేజ పరారీలో ఉండగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టు బడ్డ నలుగురు వద్ద నుండి 1లక్ష 70 వేల నగదు, 5 సెల్ ఫోన్ లు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Tamilnadu rains: తమిళనాడును కుదిపేస్తున్న భారీ వర్షాలు.. నిండుకుండలా చెన్నై నగరం

ఇకనిన్న క్రికెట్‌, సట్టా నిర్వహిస్తున్న బెట్టింగ్‌ ముఠాలను అరెస్ట్‌ చేసినట్టు ముషీరాబాద్‌ సీఐ జహంగీర్‌యాదవ్‌ తెలిపారు. అయితే.. భరత్‌నగర్‌కు చెందిన చిట్‌ఫండ్‌ వ్యాపారి ఉడుత నరేషయాదవ్‌, భరత్‌నగర్‌కు చెందిన జ్యోతిష్యుడు సిరిగిరి సాయిమరియా, భోలక్‌పూర్‌ కృష్ణనగర్‌కు చెందిన అనగాని చంద్రశేఖర్‌లు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన విజయ్‌ అనే బూకీ వద్ద ఐటీఎల్‌ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌పై ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడినట్టు సమాచారం అందడంతో ముషీరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే… బూకీ విజయ్‌, మరో ఫంటర్‌ గోపీ పరారీలో ఉన్నారు. ఇక బెట్టింగ్‌ ముఠా నుంచి రూ. 61,200 నగదు, రెండు క్యాలిక్‌ లెటర్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ కు చెందిన ముషీరాబాద్‌లోని అయేషా ఫంక్షన్‌ హల్‌ వద్ద సట్టా బెట్టింగ్‌కు పాల్పడుతున్న సయ్యద్‌ ఆజామ్‌, చాంద్‌ఖాన్‌, సాధిక్‌, ఆస్లాంను అరెస్ట్‌ చేశారు. ఇక .. ఆర్గనైజర్‌ మహ్మద్‌ సాదిక్‌, షేక్‌ ఫహీం, ఇమ్రాన్‌, ఎండీ సుస్రత్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం గాలిస్తున్నట్టు సీఐ జహంగీర్‌యాదవ్‌ తెలిపారు.
Operation Gone Wrong: డాక్టర్ నిర్వాకం.. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో వచ్చిన వ్యక్తికి ఆపరేషన్ చేసి..

Exit mobile version