NTV Telugu Site icon

CPI Narayana: చంద్రబాబు లాగే కేటీఆర్‌ పరిస్థితి.. ప్రజలు బుద్ది చెప్తారు..

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: చంద్రబాబుకు ఓట్లు వస్తాయని గతంలో అనుకున్నారు కానీ ఆయనకు మూడు నామాలు ప్రజలు పెట్టారని, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు.. కానీ ప్రజలు బుద్ధి చెప్తారని జాతీయ కార్యదర్శి సీ.పీ.ఐ.కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్ని సంస్థలు చెప్తున్నాయన్నారు. బీఆర్ఎస్ రావడం లేదని సర్వే సంస్థలు బోగస్ అని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలతో మాకు సంబంధం లేదన్నారు. వృద్ధులు ఓటు వేసినా యంగ్ స్టార్స్ ఓటు వేయలేదన్నారు. చంద్రబాబుకు ఓట్లు వస్తాయని గతంలో అనుకున్నారు కానీ ఆయనకు మూడు నామాలు ప్రజలు పెట్టారని తెలిపారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు.. కానీ ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. రేపు ప్రజాస్వామ్యం గెలుస్తుంది – అహంభావం ఓడిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: షుగర్ కంట్రోల్ కావాలంటే ఈ పండు తప్పక తినాలి..!

ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ అహంతోనే ఒడిపోతున్నారని అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ నుంచి బహిష్కరించబడ్డ రేవంత్ రెడ్డి సభా నాయకుడిగా అసెంబ్లీకి వెళ్లనున్నారని అన్నారు. కేసీఆర్ కు సరిజొడి మోడీ.. కానీ తెలంగాణలో సరిజోడి కానీ రేవంత్ చేతిలో అవమానంపాలు కానున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పదిమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటే ప్రజాస్వామ్యం బతికే ఉంది అన్నట్లు అన్నారు. తెలంగాణ అభవృద్ధి జరిగింది అంటున్నారు కేసీఆర్… కానీ కల్వకుంట్ల ఖజాన మాత్రం పెరిగిందన్నారు. బీఆర్ఎస్ పై యూత్, దళితులు తీవ్రమైన వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. మేము పోటీ చేసిన కొత్తగూడెంలో సీపీఎం పార్టీ శ్రేణులు సహకరించాయన్నారు.
Copper Ring: రాగి ఉంగరాన్ని ఏ వేలికి పెట్టుకుంటే మంచిది..?

Show comments