NTV Telugu Site icon

CPI Narayana: ప్రజాగర్జన సాక్షిగా.. సీఎం కేసీఆర్‌కి సీపీఐ నారాయణ సూటి ప్రశ్నలు

Cpi Narayana On Kcr

Cpi Narayana On Kcr

CPI Narayana Questions CM KCR On Promises: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ప్రజాగర్జన సభ సాక్షిగా.. సీఎం కేసీఆర్‌కు సీపీఐ నారాయణ కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. దళిత బందు ప్రకటించారు, అది ఎంతమందికి వస్తుంది? అని నిలదీశారు. 3 ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చారో తేల్చాలని డిమాండ్ చేశారు. పొడు భూముల పరిస్థితి ఏంటి? పొడుభూముల సంఖ్య ఎంత? కాంట్రాక్టు కార్మికుల సమస్య ఎందుకు పరిష్కరించట్లేదు? ఓట్ల లెక్కలతో ముందుకెళ్లాలా, అయితే పొత్తులు ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని ఆరోపించారు.

GVL Narasimha Rao: ఇప్పటికీ మేము జనసేనతో పొత్తులోనే ఉన్నాం..

బీజేపీని వ్యతిరేకించే పార్టీలతోనే తాము ముందుకు వెళ్తామని నారాయణ మరోసారి స్పష్టం చేశారు. తమ సీట్లను తాము అడుక్కోమని, అది తమ రాజకీయ హక్కు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి తొత్తుగా పని చేస్తున్నాడని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మోడీ, అమిత్ షా తెలంగాణాలో చిత్తకార్తె కుక్కల్లా తిరిగారని, అయినా చివరికి ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతం వామపక్ష పార్టీలకు పుట్టినిల్లని అన్నారు. ఖమ్మంలో కొంతమంది డబ్బులు పట్టుకొని తిరుగుతున్నారు.. డబ్బులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాల రాజకీయాల్లో కుదరవని తేల్చి చెప్పారు. అసలు పొంగులేటి ఎవరు? డబ్బుల అహంభావంతోనే వస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అవకాశవాదులను కొత్తగూడెం ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

Bandi Sanjay: నోరు జారిన బండి సంజయ్.. ఎంత పెద్ద మాట అన్నారు సార్

వంట గ్యాస్ ధర, పెట్రోల్ ధర, నిత్యావసర ధరలు పెరుగుతుంటే.. అది చూస్తూ కూర్చున్న మోడీ ప్రభుత్వం మనకు అవసరమా? అని సీపీఐ నారాయణ అడిగారు. అంతకుముందు.. ఈ సభకు ఈనాటి పెళ్లికొడుకు కూనంనేని కునంనేని సాంబశివ రావు అని ఛలోక్తులు పేల్చారు. ఇది ఎన్నికల బహిరంగ సభ అంటున్నారని, కచ్ఛితంగా ఇది ఎన్నికల బహిరంగ సభేనని అన్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటే, సమస్యలపై తప్పకుండా పోరాడుతామని హామీ ఇచ్చారు. నీతిమల్లి తాము ఎప్పుడూ సీట్ల కోసం పోత్తులకు వెళ్లేదని స్పష్టం చేశారు.