NTV Telugu Site icon

CPI Narayana: సెక్యూలర్ అని చెప్పుకునే వారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు..!

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: సెక్యూలర్ అని చెప్పుకునే వారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల దాకా ఇండియా కుటుంబం ఉంటుంది కానీ కూటమిలో కొంతమంది పోవచ్చన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎవరైనా శతవు ఉంటే అది బీజేపీ అన్నారు. తెలుగు ప్రజానీకానికి ఒక బద్ధ శత్రువు లాగా బిజెపి మారిందని మండిపడ్డారు. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో కెసిఆర్ .. బీజేపీని కౌగిలించుకున్నారు కాబట్టి ఓడిపోయారన్నారు. బిజెపిది ధృతరాష్ట్రుడి కౌగిలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళింది కాబట్టే విజయం సాధించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమిలో చిత్తశుద్ధిగా పనిచేసే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు ఆందోళనగా మారాయన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మతాన్ని పెపొందించారని మండిపడ్డారు. కాబినెట్ లో కూడా మతాన్ని రాజకీయం చేశారన్నారు. ఏ రాజ్యాంగానికి లోబడి ఎన్నికయ్యారో దానికి మూడు నామాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం,రాజకీయం ఒకటి చేశారని తెలిపారు.

Read also: Tamilisai: జాతీయ ఓటరు దినోత్సవంలో గవర్నర్‌.. అసెంబ్లీ ఎన్నికల ఘటనపై ప్రస్తావన..!

అయోధ్య రామాలయం నిర్మాణము కు మేము వ్యతిరేకం కాదన్నారు. అన్ని ఊరల్లో రామాలయలు ఉన్నాయని, ఒక ఈవెంట్ లాగా రామాలయం ఓపెనింగ్ మోడీ,యోగి చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు ఘటనలో అద్వానీ ఉన్నారు,అలాంటి అద్వానీ రామాలయం ఓపెనింగ్ రాలేదని అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచం మొత్తం బాబ్రీ మసీదు కులగొట్టిన అంశాన్ని చూశారన్నారు. అయోధ్య తీర్పు ఇచ్చిన వారిలో ఒకరు రాజ్యసభ లో,మరొకరు ఏపీ గవర్నర్ గా ఉన్నారని తెలిపారు. అయోధ్య రామాలయం ప్రారంభానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా విశాలంగా ఆలోచన చేయాలన్నారు. మోడీ బ్లాక్ మెయిల్ తో కొందరు వెనక్కి వెళ్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా అందరిని కలుపుకొని పోవాలన్నారు. సెక్యూలర్ అని చెప్పుకునే వారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి.. గవర్నర్ ఆమోదం..