NTV Telugu Site icon

Rachakonda Report: రాచకొండ క్రైమ్ రిపోర్ట్ ఇదే… కమిషనర్ సుధీర్ బాబు క్లారిటీ

Rachakonda Cmisenar

Rachakonda Cmisenar

Rachakonda Report: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27664 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 29166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి. పిల్లలపై లైంగిక వేధింపులు, హత్యలు, కిడ్నాప్‌ల కేసులు పెరిగాయి. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు. 282 డ్రగ్స్ కేసుల్లో 698 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

Read also: Kodali Nani: నాడు ఎన్టీఆర్, వైఎస్సార్.. నేడు వైఎస్‌ జగన్..

మహిళలపై నేరాలు 6.65 శాతం తగ్గాయి. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మందిని అరెస్టు చేశారు. ఆరుగురిపై పీడీ యాక్ట్‌ పెట్టారు. గేమింగ్ యాక్ట్ కింద 188 కేసులు నమోదు చేసి 972 మందిని అరెస్టు చేశారు. ఏడాది కాలంలో 5241 నేరాలకు సంబంధించి శిక్షలు ఖరారు చేశామన్నారు. నేరారోపణల రేటు 62 శాతం పెరిగిందని చెప్పారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడింది. సైబర్ నేరాల్లో 42 మంది అంతర్రాష్ట్ర, విదేశీ నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.89.92 లక్షల నగదును స్తంభింపజేసి బాధితులకు అందజేశారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 64 మంది చిన్నారులను.. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 136 మంది చిన్నారులను కాపాడినట్లు వెల్లడించారు. 21 బాల్య వివాహాలను నిలిపివేశారు.

Read also: Bharat Rice: కిలో బియ్యం కేవలం 25 రూపాయలకే.. త్వరలో మార్కెట్లోకి భారత్ రైస్

మెట్రో రైళ్లలో 730 డెకాయ్ ఆపరేషన్లు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో 16594 కేసులు నమోదు కాగా.. 2900 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది 3321 ప్రమాదాలు జరగగా 633 మంది మరణించారు. అలాగే, 3205 మంది గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు 16 శాతం పెరిగాయి. ఈ ఏడాది 56 కేసుల్లో 153 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అరెస్టు చేసింది. 71 మంది బాధితులకు విముక్తి కల్పించామన్నారు. సోషల్ మీడియాలో 8758 ఫిర్యాదులు రాగా 4643 పరిష్కరించినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Pawan Kalyan: న్యూ ఇయర్ కి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు…