Site icon NTV Telugu

CP CV Anand : పంజాగుట్ట పీఎస్‌లో ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. స్పందించిన సీపీ ఆనంద్‌

Cp Cv Anand

Cp Cv Anand

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై, ఏఆర్‌ ఎస్సై ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రీవెడ్డింగ్‌ షూట్‌ ప్రభుత్వం వాహనాలను వాడారని, అంతేకాకుండా.. అధికార దుర్వినియోగం చేశారని కొందరు విమర్శలు చేయగా.. కొందరు వారికి అనుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌ సీటీ పోలీస్‌ కమీషనర్‌ సీపీ సీవీ ఆనంద్‌.. ఈ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌పై స్పందించారు. ఈ వీడియోను రీట్వీట్ చేసిన సీపీ సీవీ ఆనంద్… పెళ్లి చేసుకోబోతున్నామన్న ఆనందంలో ఇద్దరు ఎస్సైలు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు.

Also Read : IND vs SL Final: ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా.. భారత్ బౌలర్లు మెరుపు దాడి

పెళ్లి వారికి గొప్ప విషయమే కావొచ్చు కానీ, పోలీస్ స్టేషన్ లో ప్రీ వెడ్డింగ్ వీడియో కొంచెం ఎబ్బెట్టుగా ఉందన్నారు. పోలీసు ఉద్యోగం అంటే కత్తిమీద సాములాంటిందన్నారు. మహిళలకైతే మరింత కష్టమని తెలిపారు సీపీ సీవీ ఆనంద్‌. ఈ ఉద్యోగంలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు మూడు ముళ్ల బంధంతో ఒక్కతవ్వడం సంతోషించాల్సిన విషయం అని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో పోలీస్‌ దుస్తుల్ని, చిహ్నాలను ఉపయోగించడాన్ని తాను తప్పుబట్టడం లేదన్నారు. కానీ ఈ విధమైన చర్యలకు వారు ముందే అనుమతి తీసుకుంటే బాగుండేదన్నారు. వాళ్లు నన్ను పెళ్లికి పిలవకపోయినా, వెళ్లి ఆశీర్వదించాలని ఉందన్నారు. ఇకపై అనుమతి తీసుకోకుండా ఈ పనులు చేయొద్దని సున్నితంగా హెచ్చరించారు

Also Read : Exxeella Education Group : ఇంటర్నేషల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

Exit mobile version