హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ సుందరికారణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో చారిత్రకమైన ప్లేస్ ట్యాంక్ బండ్…ఎన్నో ప్రాంతాల నుండి సందర్శకులు వస్తారు. హైదరాబాద్ నగరానికి ప్రతీక అయిన ట్యాంక్ బండ్ సుందరికారణ కార్యక్రమం కొంత కాలం జరుగుతుంది. ఇప్పుడు ట్యాంక్ బండ్ సుందరికారణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంటర్నేషనల్ సిటీస్ లో వాటర్ ఫ్రాంట్ ఏరియా లో పాదచారులుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలా హైదరాబాద్ ట్యాంక్ బ్యాండ్ వద్ద కూడా ఏర్పాటు చేయాలని యోచన. కేటీఆర్ సిటీ పోలీస్ కి ట్విట్టర్ ద్వారా ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ నిలుపుదల పై డైరెక్షన్ ఇచ్చారు. ట్రయిల్ చేసి చూడాలి అని సూచించారూ అని తెలిపారు.
అయితే ఆదివారం సాయంత్రం ట్యాంక్ బ్యాండ్ పై ట్రాఫిక్ డైవెర్షన్ ఎలా చేయాలి అనేదానిపై సుదీర్ఘంగా డిస్కషన్ చేసాము. ఈరోజు మొదటి రోజు ట్రయిల్ చేసాము. సాయంత్రం వేళలా నగరవాసులు అందరూ కుటుంబసమేతంగా వచ్చి ఎంజాయ్ చేసే వాతావరణం ఇక్కడ ఉంది. ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు నగర వాసులు అందరూ సహకరించాలి.
