NTV Telugu Site icon

Cows Burnt Case: పశువుల తరలింపు కేసు.. ఐదుగురి అరెస్ట్

Cows Deat1

Cows Deat1

అంబులెన్స్ లో పశువులను తరలించిన కేసులో ఐదుగురు నిందితుల్ని నిజామాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు వ్యక్తులు వున్నట్టు పోలీసులు తెలిపారు. వీరినుంచి 5 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు తెలిపారు.

రెంజల్ మండలం శాటాపూర్ సంతలో పశువులు కొనుగోలు చేశారు. హైద్రాబాద్ లో అంబులెన్స్ ను తయారు చేయించారు. వేడి వల్ల రాపిడికి అంబులెన్స్ లో మంటలు వ్యాపించాయి. దీంతో 13 పశువులు సజీవ దహనమయ్యాయి. పశువులను బంధించి తీసుకెళ్లడం నేరం. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అసలేం జరిగిందంటే….

గత కొంతకాలంగా పశువులను కొని వాటిని కబేళాలకు తరలిస్తుంటారు. ఇదంతా అక్రమంగా సాగుతుంటుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన వాహనాన్ని అంబులెన్సుగా మార్చారు. అందులో మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండేవారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలం మాక్లూర్‌ తండా వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి అంబులెన్సు దగ్ధమైన ఘటనలో 13 ఎద్దులు సజీవ దహనం అయ్యాయి. కాలిపోయిన కోడెద్దులను అటవీ ప్రాంతంలో ఖననం చేశామన్నారు. రెంజల్‌ మండలం సాటాపూర్‌ పశువుల సంతలో వాటిని కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో తనిఖీలు కట్టుదిట్టం చేయడంతో ఎద్దుల తరలింపునకు అక్రమ మార్గాలు అనుసరించారు. ద్దుల అకాల మరణానికి కారణమైన ఎనిమిది మందిపై ఇందల్‌వాయి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు సీపీ చెప్పారు. ఈ ఘటనను ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. చెక్‌పోస్టుల వద్ద భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Show comments