NTV Telugu Site icon

మ‌ళ్లీ తెర‌పైకి డ్ర‌గ్స్ కేసు…ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం…

2017లో టాలీవుడ్‌ను డ్ర‌గ్స్ కేసు సంచ‌ల‌నం సృష్టించింది.  డ్ర‌గ్స్‌కు సంబందించి మొత్తం 12 కేసుల‌ను ఎక్సైజ్ పోలీసులు న‌మోదు చేశారు.  ఈ కేసులో సిట్ ఇప్ప‌టికే ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేసింది.  కాగా, ఈ ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం తెలిపింది.  ఈ కేసులో మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మ‌రో 27 మందిని అధికారులు విచారించారు.  

Read: విచిత్రమైన స్టైల్ తో… హాలీవుడ్ స్టార్ ని కాపీ కొట్టి… అడ్డంగా దొరికేసిన రణవీర్!

60 మందిని అధికారులు విచార‌ణ చేశార‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.  12 కేసుల్లో మొద‌టి 8 కేసులు మాత్ర‌మే ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  11 మంది ప్ర‌ముఖుల‌తో పాటు హీరో ర‌వితేజ‌, డ్రైవ‌ర్ శ్రీనివాస్‌ను కూడా అధికారులు విచార‌ణ చేశారు.  డ్ర‌గ్స్ కేసులో 11 మంది ప్ర‌ముఖుల‌కు ఎక్సైజ్ అధికారులు క్లీన్‌చీట్ ఇచ్చారు.  ఛార్జ్‌షీట్‌కు ఆమోదం తెల‌ప‌డంతో ఈ కేసు తిరిగి తెర‌పైకి వ‌చ్చింది.