Suicide: ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతుల ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దంపతులు బలవర్మణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. సంగారెడ్డిలోని నారంరెడ్డి కాలనీకి చెందిన త్రినాథ్‌రెడ్డి(35), ఆయన భార్య మల్లిక (33) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. త్రినాథ్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా.. మల్లిక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వారికి 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. పెళ్లి అయిన కొన్ని ఏళ్ల వరకు సాఫీగా సాగిన వారి ప్రయాణంలో గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరూ గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతసేపైనా గది నుంచి దంపతులు బయటకు రాకపోవడంతో త్రినాథ్‌రెడ్డి తల్లి అమరావతి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి త్రినాథ్‌రెడ్డి, మల్లికను ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. త్రినాథ్‌రెడ్డి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం వారి మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!