Counting Process: లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 4న జరగనున్న హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపునకు ఒక్కో హాలులో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అత్యధిక పోలింగ్ కేంద్రాలున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 20 టేబుళ్లు, మిగిలిన నియోజకవర్గాలకు 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.
Read also: BRS Candle Rally: నేడు బీఆర్‌ఎస్ క్యాండిల్ ర్యాలీ.. గన్ పార్క్ నుంచి సచివాలయం వరకు
సికింద్రాబాద్ పార్లమెంట్‌లో 10 టేబుళ్లు, హైదరాబాద్ పార్లమెంట్‌లో 14 టేబుల్స్ ఉన్నాయి. కౌంటింగ్‌లో 1000 మంది సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్‌కు 650 మంది అవసరం కాగా, దాదాపు 350 మందిని రిజర్వ్‌లో ఉంచారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరగనుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను కీసర మండలం భోగారం కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించి పలు సూచనలు చేశారు.
Tank Bund Traffic: ఆదివారం నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు ట్యాంక్‌బండ్ బంద్..