రైతులు తాము పండించిన పంటలకు మంచి ధర లభిస్తే ఆనందంగా వుంటారు. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తీవ్రంగా నష్టపోతుంటారు. తాజాగా పత్తి రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్ కొత్త పత్తికి మంచి ధర పలకడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు నెల ముందే కొత్త పత్తిని అమ్మకాలకు తెస్తున్నారు రైతులు. కొత్త పత్తి రావడంతో మార్కెట్ అధికారులు హమాలీలు తడ్వాయిలు రైతులు కొనుగోలుదారులు కమిషన్ ఏజెంట్లు కాంటాలకు పూజలు చేసి కొనుగోలు ప్రారంభించారు.
Read Also: Revanth Reddy: హైదరాబాద్‌కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్
గత సంవత్సరం అక్టోబర్ మొదటి వారంలో కొత్త పత్తి మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. అప్పుడు క్వింటాల్ పత్తి ధర కేవలం రూ ఆరువేలు మాత్రమే పలికింది ఈ సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలోనే కొత్త పత్తి విక్రయానికి రావడంతో కాంటాలకు పూజలు చేసి కొనుగోలు ప్రారంభించారు. కొత్త పత్తి మార్కెట్లో క్వింటాల్ ధర 8199 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ చరిత్రలోనే ఈ ధర కొత్త పత్తికి నమోదు కాలేదని రైతులు అంటున్నారు.
ఈ సంవత్సరం వర్షాల కారణంగా పత్తి చేలు దెబ్బతిన్నప్పటికీ మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉందంటున్నారు. ఈ ధరలు ఇలానే కొనసాగితే ఈ సంవత్సరం తమకు లాభసాటిగా ఉంటుందని రైతులంటున్నారు. ఈ ఏడాది నెల ముందుగానే కొత్త పత్తి మార్కెట్లో రావడం జరిగిందని, క్వింటాల్ ధర రూ. 8199 నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది రాబోయే రోజులలో ధర మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే పత్తి ధర ఆశాజనకంగా ఉందని రైతులు తేమ లేకుండా చూసుకొని పత్తి మార్కెట్ కు విక్రయానికి తీసుకొస్తే మరింత ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు.
Read Also: Attacks on Lenders: తీసుకున్న అప్పు తీర్చమంటే దాడులు