సిటీలు, పట్టణాలు, గ్రామాలు, గూడాలు, మారుమూల ప్రాంతాలనే కాదు.. అడవిలో ఉన్న అన్నల వరకు చేరింది కరోనా వైరస్… కోవిడ్ చికిత్స కోసం వచ్చి.. మావోయిస్టు పార్టీ డివిజినల్ కమిటీ కార్యదర్శి మరియు ఓ కొరియర్ పోలీసులకు చిక్కడంతో ఈ విషయం వెలుగుచూసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ములుగు నుండి వస్తున్న కారును తనీఖీ చేశారు.. కారు వెనుక భాగంలో అనుమానస్పదంగా వున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి విచారించగా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన దండకారుణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ ఆలియాస్ మోహన్ ఆలియాస్ శోబ్రాయ్ గా తేలింది.. ఆయనతో పాటు.. మావోయిస్టు పార్టీ కొరియర్ బందుగ వినయ్ కూడా ఉన్నాడు.. పోలీసులు అరెస్టు చేసిన గడ్డం మధుకర్‌ది కొండపల్లి గ్రామం, బెజ్జూర్ మండలం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.. 1999 సంవత్సరంలో సిర్పూర్ దళంలో చేరాడు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు విధ్వంసాలకు పాల్పడినట్టుగా చెబుతున్నారు పోలీసులు.. ఇక, మావోయిస్టు కొరియర్‌గా గుర్తించిన వ్యక్తి మైనర్ కావడంతో.. వివరాలు వెల్లడించలేదు పోలీసులు.
మెరుగైన చికిత్స కోసం హన్మకొండలో ఏదైనా హస్పటల్ చేర్పించాల్సిందిగా కొరియర్ నరేష్ ఈ మైనర్ కోరియర్ కి సెల్ ఫోన్ ద్వారా గత నెల 31వ తేదిన కొరియర్ నరేష్ సూచించడంతో, సదరు మైనర్ కొరియర్ ఎటూరునాగారం మీదుగా కారులో బయలుదేరి వెళ్లి వెంకటాపూర్ ఆటవీ ప్రాంతం నుండి కోవిడ్ తో భాధపడుతున్న మావోయిస్టు గడ్డం మధుకర్ ను కారు వెనుక భాగం పడుకోబెట్టి హన్మకొండకు తీసుకెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్దనున్న రూ. 88వేలు స్వాధీనం చేసుకున్నారు.. కోవిడ్ భాధపడుతూ చాల నీరసంగా వున్న గడ్డం మధును మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి.. ఇక, తమ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయని వెల్లడించారు.. గడ్డం మధుకర్ ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ కి చెందిన సూమారు 12 మంది కీలక నాయకులతో పాటు పార్టీ సభ్యులు కోవిడ్ తో బాధపడుతున్నారని. అందులో.. కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ, యాప నారయణ ఆలియాస్ హరిబూషణ్, బడే చోక్కారావు ఆలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి ఆలియాస్ ధర్మన్న, కట్టా రాంచందర్ రెడ్డి ఆలియాస్ వికల్స్, ములా దేవేందర్ రెడ్డి ఆలియాస్ మాస దడ, కున్ కటి వెంకటయ్య ఆలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ ఆలియాస్ రఘు, కొడి మంజుల ఆలియాస్ నిర్మల, పూసం పద్మ కాకర్ల సునీత ఆలియాస్ బుర్రా వున్నారు. వీరు కోవిడ్ వ్యాధికి చికిత్స చేసుకోనేందుకు మావోయిస్టు పార్టీ వీరికి అనుమతించడం లేదన్నారు. కేవలం ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినప్పుడు మాత్రమే కోవిడ్ తో గురైనవారికి మెరుగైన చికిత్స పొందేందుకు మాత్రమే పార్టీ అనుమతి ఇవ్వడం జరుగుతున్నట్టు తెలిపారు.