Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Corona Infection To 12 Key Maoist Leaders Says Warangal Cp Tarun Joshi

12 మంది మావోయిస్టు కీల‌క నేత‌ల‌కు క‌రోనా.. చికిత్స‌కోసం వ‌చ్చి చిక్కి..!

Published Date :June 2, 2021 , 4:05 pm
By Sudhakar Ravula
12 మంది మావోయిస్టు కీల‌క నేత‌ల‌కు క‌రోనా.. చికిత్స‌కోసం వ‌చ్చి చిక్కి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సిటీలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాలు, గూడాలు, మారుమూల ప్రాంతాల‌నే కాదు.. అడ‌విలో ఉన్న అన్న‌ల వ‌ర‌కు చేరింది క‌రోనా వైర‌స్‌… కోవిడ్ చికిత్స కోసం వ‌చ్చి.. మావోయిస్టు పార్టీ డివిజినల్ కమిటీ కార్యదర్శి మరియు ఓ కొరియర్ పోలీసుల‌కు చిక్క‌డంతో ఈ విష‌యం వెలుగుచూసింది.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మంగ‌ళ‌వారం మధ్యాహ్నం సమయంలో మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ములుగు నుండి వస్తున్న కారును తనీఖీ చేశారు.. కారు వెనుక భాగంలో అనుమానస్పదంగా వున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి విచారించగా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన దండకారుణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ ఆలియాస్ మోహన్ ఆలియాస్ శోబ్రాయ్ గా తేలింది.. ఆయ‌న‌తో పాటు.. మావోయిస్టు పార్టీ కొరియర్ బందుగ వినయ్ కూడా ఉన్నాడు.. పోలీసులు అరెస్టు చేసిన గడ్డం మధుకర్‌ది కొండపల్లి గ్రామం, బెజ్జూర్ మండలం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.. 1999 సంవత్సరంలో సిర్పూర్ దళంలో చేరాడు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు విధ్వంసాలకు పాల్ప‌డిన‌ట్టుగా చెబుతున్నారు పోలీసులు.. ఇక‌, మావోయిస్టు కొరియ‌ర్‌గా గుర్తించిన వ్య‌క్తి మైన‌ర్ కావ‌డంతో.. వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు పోలీసులు.

మెరుగైన చికిత్స కోసం హన్మకొండలో ఏదైనా హస్పటల్ చేర్పించాల్సిందిగా కొరియర్ నరేష్ ఈ మైనర్ కోరియర్ కి సెల్ ఫోన్ ద్వారా గత నెల 31వ తేదిన కొరియర్ నరేష్ సూచించడంతో, సదరు మైనర్ కొరియర్ ఎటూరునాగారం మీదుగా కారులో బయలుదేరి వెళ్లి వెంకటాపూర్ ఆటవీ ప్రాంతం నుండి కోవిడ్ తో భాధపడుతున్న మావోయిస్టు గడ్డం మధుకర్ ను కారు వెనుక భాగం పడుకోబెట్టి హన్మకొండకు తీసుకెళ్తుండ‌గా పోలీసుల‌కు చిక్కాడు. ఇద్ద‌రినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్దనున్న రూ. 88వేలు స్వాధీనం చేసుకున్నారు.. కోవిడ్ భాధపడుతూ చాల నీరసంగా వున్న గడ్డం మధును మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్టు తెలిపారు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి.. ఇక‌, త‌మ విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయ‌ని వెల్ల‌డించారు.. గడ్డం మధుకర్ ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ కి చెందిన సూమారు 12 మంది కీలక నాయకులతో పాటు పార్టీ సభ్యులు కోవిడ్ తో బాధపడుతున్నారని. అందులో.. కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ, యాప నారయణ ఆలియాస్ హరిబూషణ్, బడే చోక్కారావు ఆలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి ఆలియాస్ ధర్మన్న, కట్టా రాంచందర్ రెడ్డి ఆలియాస్ వికల్స్, ములా దేవేందర్ రెడ్డి ఆలియాస్ మాస దడ, కున్ కటి వెంకటయ్య ఆలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ ఆలియాస్ రఘు, కొడి మంజుల ఆలియాస్ నిర్మల, పూసం పద్మ కాకర్ల సునీత ఆలియాస్ బుర్రా వున్నారు. వీరు కోవిడ్ వ్యాధికి చికిత్స చేసుకోనేందుకు మావోయిస్టు పార్టీ వీరికి అనుమతించడం లేద‌న్నారు. కేవలం ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినప్పుడు మాత్రమే కోవిడ్ తో గురైనవారికి మెరుగైన చికిత్స పొందేందుకు మాత్రమే పార్టీ అనుమతి ఇవ్వడం జ‌రుగుతున్న‌ట్టు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 12 key Maoist leaders
  • Corona Infection
  • Covid 19
  • CP Tarun Joshi
  • Maoist leaders

తాజావార్తలు

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions