Site icon NTV Telugu

నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో.. కరోనా బారినపడ్డ పోలీసులు

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. చిన్న పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా తన పంజా విసురుతుంది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బూస్టర్‌ డోసు కూడా ఇవ్వాలనే నిర్ణయానని తెరపైకి తెచ్చిన విషయం తెల్సిందే. బూస్టర్‌ డోసు పరిమితిని కూడా తొమ్మిది నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని ఆరోగ్య శాఖ మంత్రి హారీష్ రావు కేంద్రాన్ని కోరారు.

Read Also: సాయం దొర మాటలకే పరిమితం..కేసీఆర్‌పై షర్మిల ఫైర్‌

తాజాగా రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులకు కరోనా సోకడంతో స్టేషన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదు దారుల కోసం నార్సింగ్ పీఎస్ ఎదుట ప్రత్యేక టెంట్ వేశారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. కాగా ఇప్పటికే పోలీసు శాఖలో చాలా చోట్ల కరోనా బారినపడుతుండటంతో పోలీసులు తీవ్రభయాందోళనల మధ్య విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version