NTV Telugu Site icon

TS Inter Exams: ఇంటర్ విద్యార్థులు అలర్ట్‌.. పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!

Intr Exams

Intr Exams

TS Inter Exams: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడినా.. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. పరీక్షల్లో తప్పుడు విధానాలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఎవరైనా వచ్చి పరీక్ష రాసినా… మరేదైనా తప్పుడు విధానాలు అవలంబించినా… వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. అటువంటి అభ్యర్థులు పరీక్ష నుండి డిబార్ చేయబడతారు. అంతేకాదు ఆ సమయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు లేదా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 19 వరకు జరగనున్నాయి. పై హెచ్చరిక ఈ పరీక్షలకు వర్తిస్తుంది.

Read also: Massive Road Accident: కాకినాడ హైవేపై ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి

ఈసారి ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాల్లో 12,559 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 6,109 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,450 మంది విద్యార్థులు మొత్తం 30 కేంద్రాల్లో 20 ప్రభుత్వ, 10 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు 8.45 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలి. కాలేజీ యాజమాన్యం బలవంతంగా ఫీజులు వసూలు చేయకుండా హాల్ టిక్కెట్లు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షలకు అనుమతిస్తారు.

Read also: Telangana Weather: కూల్‌ కూల్‌ గా వాతావరణం.. అక్కడక్కడ చిరు జల్లులు..

ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు

నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ హనుమంతు కె.జెండాగే ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలపై జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కలెక్టర్ కన్వీనర్‌గా ఉండగా, పరీక్షల నిర్వహణకు 30 మంది సెంటర్ ఇంచార్జిలు (సీఎస్), 70 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు (డీవో)లను నియమించారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్, 2 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రశ్న పత్రాలు 11 స్టోరేజీ పాయింట్లలో భద్రపరచబడతాయి.

Read also: Trisha Krishnan: ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష

సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రథమ చికిత్స అందించేందుకు ఒక ఏఎన్‌ఎంను నియమించి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని, ఒకవేళ తెచ్చుకుంటే మొబైల్ పాయింట్ సెంటర్ల వద్ద భద్రత కల్పించాలని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. కమిటీ సభ్యులతోపాటు ఇతర అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది సెల్‌ఫోన్లను లోపలికి తీసుకురాకూడదు. మాస్ కాపీయింగ్ చేస్తే ఎవరైనా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ రమణి హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని డీసీపీ రాజేష్‌చంద్ర ఆదేశించారు.
Supreme Court: మహిళా కోస్ట్ గార్డ్ అధికారికి శాశ్వత కమిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ