హయత్ నగర్ పీఎస్ పరిధిలో వరుస చోరీలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. పోలీసులు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామంటున్న.. అదే టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి. మూడు ఇళ్ళలో వరుస చోరీలు.. మరో ఇంట్లో చోరీ అటెంప్ట్ చేస్తున్న సమయంలో అలజడి కావడంతో దొంగలు పారిపోయారు. బంగారం, వెండి, నగదును దోచుకెళ్ళిన దొంగలు పక్కింటి వాళ్ళు బయటికి రాకుండా తలుపులకు గడియ బిగించారు. దొంగలకు చెందిన బ్లాంకెట్, టవల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరుస చోరీలతో భయబ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. పదిహేనేళ్ళలో ఇదే మొదటిసారి జరిగిందంటున్నారు కాలనీ వాసులు. పెట్రోలింగ్ లేకపోవడం, పోలీసుల నిఘా కరువవడంతోనే చోరీలు జరుగుతున్నాయంటున్న స్థానికులు కాలనీల్లో పెట్రోలింగ్ పెంచాలంటున్నారు.