Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన కారు..

Hyderabad

Hyderabad

Hyderabad: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్లపై వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విలువైన సొత్తు స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. చెక్‌పోస్టు వద్ద వానానాలు తనిఖీలు చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పై కారు ఎక్కించి అక్కడనుంచి పరారయ్యాడు. కారుతో గుద్దడమే ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే కానిస్టేబుల్ కారు కిందపడి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ నెల 18న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వాహనాల తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేశ్. అక్కడి నుంచి ముందు బైక్ వచ్చింది బైక్ ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అతను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బైక్‌ వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారును ఆపేందుకు ప్రయత్నించగా.. కారు డ్రైవర్‌ కారు ఆపలేదు. కానిస్టేబుల్ మహేష్ పై నుంచి కారు ఎక్కించాడు. అయితే ఆపే ప్రయత్నంలో మహేశ్ కారు కిందకు పడిపోయాడు. దీంతో కారు ఢీకొనడంతో కానిస్టేబుల్ మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి పోలీసులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది ఎవరి కారు? ఎన్నికలను ప్రలోభపెట్టేందుకు ఏమైనా చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Exit mobile version