Site icon NTV Telugu

Constable Eligibility Test Hall Tickets: నేటి నుంచే కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు హాల్‌టికెట్లు

Constable Eligibility Test Hall Tickets

Constable Eligibility Test Hall Tickets

Constable Eligibility Test Hall Tickets: కానిస్టేబుల్‌ ప్రీమరీ ఉద్యోగాలకు నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షకు నేటి నుంచి హాల్‌టికెట్లు జారీచేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్ష కోసం 6.61 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ఇవాల్టి (ఆగస్టు 18వ తేదీన ఉ.8 గంటల) నుంచి www.tslprb.in వెబ్సైటులో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఆగస్టు 26వ తేదీ అర్ధరాత్రి 12 వరకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. హాల్టికెట్లు రాని వారు.. support@tslprb.in లేదా 9393711110/93910 05006 నెంబర్లను సంప్రదించవచ్చు.

ఆగస్టు 28 నిర్వహించనున్న కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్షతో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి కొత్త రికార్డు నమోదు చేయబోతుంది. స్వరాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగార్థులకు పోటీ పరీక్ష నిర్వహించిన ఘనతను సొంతం చేసుకుంది. గతంలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా 5.80 లక్షల మంది అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. కాగా.. ఆ తర్వాత అంత పెద్ద సంఖ్యలో 6.5 లక్షలు మంది అభ్యర్థులు హాజరుకానున్న పరీక్షగా కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ రికార్డు నెలకొల్పనున్నది. ఈ పరీక్షకు 1,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ పరీక్షను ఈ నెల 21న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ 28కి వాయిదాపడింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్‌ విధానంలోనే హాజరు తీసుకోనున్నారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు..
అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్‌ (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి. పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్‌ తీసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాలి. ఫోటో వేరే దాన్ని అతికించినా, హాల్‌టికెట్‌ అసమగ్రంగా ఉన్నా పరీక్షకు అనుమతించరు గమనించగలరు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతి ఉండదు. పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్‌ వేలిముద్ర తీసుకుంటారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఉండదు. అభ్యర్థులు చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలనూ కేంద్రాల్లోకి అనుమతించరు. ఇక హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలని అధికారులు సూచించారు.

CWC Meeting: నేడు కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశం

Exit mobile version