Congress Training Classes: బోయినిపల్లి లోని గాంధీ ఐడియాలోజి కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, మరియ సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన, శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్ నాయకులు, జోడో అభియాన్ జాతీయ సమన్వయ కర్త గిరీష్ ఛాడొంకర్ తదితరులు పాల్గొంటారు. అయితే.. ఇవాళ బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో జరిగే కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు నేడు జరిగే మీటింగ్ కు వెళ్లాలా ? వద్దా ? అనే సమాలోచనలో ఉన్నారు.
Read also: Pathaan: పఠాన్‌కి షాకిచ్చిన CBFC.. సినిమా వాయిదా?
ఇక తాజాగా.. ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడిన అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చేతులెత్తి మొక్కుతున్నా అంటూ దిగ్విజయ్ సింగ్ కోరారు. సీనియర్లతో పీసీసీ చీఫ్ వరుస సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. ఏమైనా సమస్యలుంటే పార్టీలో చర్చించుకోవాలని, బహిరంగ విమర్శలు, వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ పర్యటన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్‌లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు సీనియర్లు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ లో ఇంకా సమ్మతి లేదని అసమ్మతి కొనసాగుతోందని తెలుస్తోంది. మరి ఖర్గే ఫోన్ కాల్ తో అయినా కాంగ్రెస్ నాయకులు మళ్లీ కలుస్తారా? అసలు కాంగ్రెస్ శికణ తరగతులకు హాజరు అవుతారా? అనే విషయం పై ఉత్కంఠత నెలకొంది.
Harassment: దేశం విడిచి వెళ్తే రూ.కోటి ఇస్తామంటున్నారు.. సిట్ దర్యాప్తుకు హాజరైన మహిళా కోచ్
