NTV Telugu Site icon

Haath se haath Jodo: రేవంత్‌ తో వీహెచ్‌ పాదయాత్ర.. సాయంత్రం భట్టితో..

Haat Se Haat Jodo Yatra

Haat Se Haat Jodo Yatra

Haath se haath Jodo: తెలంగాణలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో చేయనున్నారు. ఈనేపథ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు రేవంత్ పాదయాత్రలో పాలుపంచుకోనున్నారు. టీపీసీసీ రేవంత్‌ తో కలిసి రెండు రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు వీహెచ్‌. ఇవాళ భద్రాచలంలో.. రేపు పాలకుర్తి జరుగుతున్న పాదయాత్రలో వీహెచ్ పాల్గొననున్నారు. కాగా.. భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా జరుగుతున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రలో రెండు రోజుల పాటు పాల్గొననున్నట్టు హనుమంతరావు ప్రకటించారు. కాగా.. ఈరోజు సాయంత్రం భద్రాచలంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని, రేపు పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొననున్నట్లు వీహెచ్ తెలిపారు.

Read also: Bajrang Dal: ప్రేమికుల రోజు రచ్చ షురూ.. ఎల్బీనగర్ లో భజరంగ్ దళ్ హల్‌ చల్‌

అయితే.. ఒక మరోవైపు ఈరోజు పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేవంత్‌ రెడ్డి ఓవైపు.. మరోవైపు ఇవాళ వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర పాలకుర్తిలోకి ప్రవేశించనుంది. కాగా.. రేపు, ఎల్లుండి పాలకుర్తిలో రేవంత్, షర్మిల పాదయాత్రలు నిర్వహించనున్నారు. వీరద్దరి కీలక నేతల పాదయాత్రలు ఒకే నియోజకవర్గంలో ఉండటంతో ఉత్కంఠ చోటు చేసుకుంది. దీంతో.. పాలకుర్తిలో భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. గతంలో పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక.. బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలోనే బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి అది క్రమంగా ఘర్షణకు దారి తీసింది. ఈనేపథ్యంలో.. బండి సంజయ్ నాడు మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలతో బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేస్తూ బండి సంజయ్‌కు అడుగడునా అడ్డుకుంటామని, మళ్లీ ఇలాంటి ఘటనలు ఇప్పుడు పునరావృత్తం అవుతాయని ప్రచారం జరుగుతుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈఘటన తాజాగా చోటుచేసుకున్న నేపథ్యంలో మళ్లీ రేవంత్ రెడ్డి, షర్మిల పాదయాత్రతో పాలకుర్తిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న విషయం పై సర్వత్రా ఉత్కంఠంగా మారింది.
Rashmi: బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రష్మీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.