NTV Telugu Site icon

లక్షమందితో ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 9న నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభ ఏర్పాట్లపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ విప్ అనిల్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు నిన్న పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించారు. గత ఏడేళ్లలో ఆదిలాబాద్‌ జిల్లాలో ఏ పార్టీ నిర్వహించనంత పెద్దఎత్తున దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. లక్ష మంది హాజరవుతారని భావిస్తున్న ఈ సభ నిర్వహణ కోసం ఇంద్రవెల్లిలో 18 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుంటున్నారు.