Bhatti Vikramarka: భట్టి విక్రమార్క కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ లో భాగంగా ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈరోజు కాంగ్రెస్ ప్రజాయాత్ర బహిరంగ సభ నిర్వహించనుంది. భట్టి విక్రమార్క పాదయాత్ర నేటితో 70వ రోజుకు చేరుకున్న సందర్భంగా జడ్చర్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4: 00 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు, తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొంటారు. సభ ఏర్పాట్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. సభకు నాయకులు, ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read also: CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రంలోనూ విజయపతాకాన్ని ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకోసం తరచూ సభలు, సమావేశాలు, నిర్వహించాలని నిర్ణయించారు. ఓ వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు పీసీసీ వారి నేతృత్వంలో సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈరోజు భారీ సమావేశం జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో జరిగిన తొలి బహిరంగ సభను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఉదండాపూర్, వల్లూరు గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి ప్రాజెక్టుల కోసం భూములు లాక్కుంటుందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని భట్టి నిర్వాసితులకు హామీ ఇచ్చారు.
RC 16: అనుకున్న దాని కన్నా ముందుగానే ప్లాన్ చేస్తున్నావా బుచ్చిబాబు?