NTV Telugu Site icon

Revanth Reddy: అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారింది

Revanthreddy, Munugodu

Revanthreddy, Munugodu

అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ తీవ్రంగా విమర్శించారు. యాదాద్రి జిల్లాలో పాదయాత్ర సంర్భంగా టీపీసీసీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో ప్రజలు మునుగోడు వైపు చూస్తున్నారని తెలిపారు. సాయుద పోరాటానికి మునుగోడు చిరునామా అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పాత్ర కీలకంమని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ వివక్షకు గురవుతుందని అన్నారు. కేసిఆర్ మునుగోడు సమస్యలకు పరిష్కారం చూపలేదని గుర్తుచేశారు. పోడుభూముల సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. రోడ్లు అధ్వాన్నంగా, సాగు, తాగు నీటి సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కేసీఆర్‌ అవలంభించిన పద్ధతులనే అమలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు.

బీజేపీ పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మునుగోడులో కేసీఆర్‌ కు భిన్నంగా బీజేపీ చేస్తున్నది ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజాపతినిధులను బీజేపీ బహిరంగంగా కొనుగోలు చేస్తుంటే ఈటెల ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజీనామాల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అంటే మొదట బీజేపీ 4 ఎంపీలు రాజీనామాలు చేయాలని అన్నారు. బీజేపీ పార్టీ ఎంపీలను కూడా రాజీనామా చేయించాలని, పార్టీలు మారిన వారిని రాజీనామా చేసిలా ప్రజలు ఒత్తిడి తీసుకురండని డిమాండ్‌ చేశారు రేవంత్‌ రెడ్డి. అమ్ముడుపోయిన ప్రతి వాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే మునుగోడులో కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. డిండి ఎత్తిపోతల పథకానికి వెంటనే కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరారు. SLBC ప్రాజెక్ట్ ను కేసీఆర్ నిర్వీర్యం చేసాడని పేర్కొన్నారు.

ఎన్నికలు జరగడానికి 100రోజుల సమయం ఉందని, వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారం విడుదల చేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి బీజేపీ జాతీయ నేత అమిత్ షా జాతీయ హోదా కల్పించి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళాలని తెలిపారు. ఒక్క ఓటుతో ఇద్దరు తోడు దొంగలకు టీఆర్‌ఎస్‌, బీజేపీ బుద్దిచెప్పాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అరాచకం సృష్టించదానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ లు తీరాలేపాయన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణి చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని, టీఆర్‌ఎస్‌, బీజేపీ లు ఉప ఎన్నికల కోసం వేయి కోట్లు ఖర్చు పెడతారని తెలిపారు. కాంగ్రెస్ గెలవకపోతే పేదల గొంతు చచ్చిపోతుందని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి ఈసందర్భంగా తెలిపారు.
TRS Mega Rally Live : హైదరాబాద్ నుండి మునుగోడుకు కేసీఆర్ భారీ ర్యాలీ.!